ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 149వ “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం నాడు ఘనంగా జరిగింది. గొల్లపూడి మారుతీరావుకు నివాళితో కార్యక్రమం ప్రారంభమైంది. ఆయన చేతుల మీదుగ ఈ సాహితీ వేదిక ప్రారంభమైందని సభికులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి నివాళిగా 2నిముషాలు మౌనం పాటించారు. రామచంద్రనాయుడు టాంటెక్స్ 12వ వార్షికోత్సవంలో సత్య హరిచంద్ర నాటకంలో కాటి సీను ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. వేముల సాహితి, వేముల సింధూర “శ్రీ రామదాసు” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. వేముల లెనిన్ మరియు కిరణ్మయి వేముల రామచంద్రనాయుడుతో వున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి నందివాడ భీమారావుని సభకు పరిచయం చేశారు. కన్నెగంటి చంద్రశేఖర్ నందివాడ భీమారావు రచించిన “The Art of the Impossible” పుస్తకాన్ని పరిచయం చేసి ఆవిష్కరణ చేశారు. ప్రముఖక కవి వి.ఆర్.విద్యార్థి తమ ఉపన్యాసంలో 1947లో మొదలు పెట్టిన స్వతంత్ర భారత చరిత్రకి ఇప్పుడు డెబ్భయి సంవత్సరాలు నిండాయి. ఈ 70 సంవత్సరాలలో మన దేశం సాధించిన ప్రగతి అంకెల్లో కొలిస్తే ఎంతో గణనీయంగా కనిపిస్తుంది. ఇవాళ $2.2 త్రిల్లిఒన్ ఘ్డ్ఫ్ తో మన దేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది అని అన్నారు. భీమారావుని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షులు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
అట్టడుగున పడి కనిపించని కథలపై టాంటెక్స్ సాహితీ సదస్సు
Related tags :