Politics

అమరావతిపై వైకాపా ఆటలాడుతోంది

Chandrababu Slams Jagan's Mind Games On Amaravathi

అమరావతిపై వైకాపా నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శాసనసభ నుంచి సస్పెండ్‌ చేసినందుకు నిరసనగా ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… ‘‘ జూన్‌ 25న ప్రజావేదికను కూల్చేశారు. ప్రజావేదిక నిర్మాణానికి రూ.7.43 కోట్లు ఖర్చయింది. ప్రజావేదికలోని సామగ్రి అంతా నేలపాలు చేశారు… ఉపయోగించుకుంటే రూ.5..6 కోట్ల విలువైన సామగ్రి ఉపయోగపడేది. ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఏమేరకు సబబు? ప్రజావేదిక కూల్చి అక్కడున్న డెబ్రిస్‌ కూడా తీయలేకపోయారు. అమరావతిపై మీకెందుకంత కోపం?. రాజధానికి రూపాయి పెట్టుబడి అవసరంలేదని పలుసార్లుచెప్పాం. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తే… ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరు భూములు కొనుగోలు చేసినా తెదేపా నేతల పేర్లు చెప్పి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. బినామీలని ఆరోపించడం నీచమైన చర్య. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. బినామీల పేరుతో భూములు కొనే ఖర్మ మా పార్టీ నేతలకు లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.