తెలంగాణ వందకు వంద శాతం లౌకిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇస్లామిక్ దేశంలో ఒకటి, రెండు పండుగలు మాత్రమే ఉంటాయని, భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కేసీఆర్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… తాగునీరు, విద్యుత్ సమస్యలేని రాష్ట్రంగా తెలంగాణను తయారుచేశామని వివరించారు. 23.. 24 ఏళ్లలో కట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా 70,80 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు.
నూరుశాతం లౌకిక రాష్ట్రం
Related tags :