డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమ గ్రంథి పనిచేయని కారణంగా ఇన్సులిన్ విడుదల కాదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇక టైప్ 2 డయాబెటిస్‌లో క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకోదు. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కఠినమైన జీవనశైలిని పాటిస్తే దాన్ని తేలిగ్గా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయడం, సరైన పోషకాలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వేళకు భోజనం చేయడం, నిద్ర పోవడం.. వంటి అలవాట్లను పాటిస్తే టైప్ 2 డయాబెటిస్ త్వరగా అదుపులోకి వస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం తాము తీసుకునే ఆహారంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. వారు తినే ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచనివి అయి ఉండాలి. అప్పుడే షుగర్ అదుపులో ఉంటుంది. అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచని ఆహారాల విషయానికి వస్తే.. వాటిలో పచ్చి బఠానీలు ముందు వరుసలో ఉంటాయనే చెప్పవచ్చు. ఇవి నిజంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. పచ్చి బఠానీలను టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే ఎంతో మంచిది. ఇవి చాలా తక్కువ క్యాలరీలను ఇస్తాయి. అందువల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. అంతేకాదు, వీటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా ఆకలి కానీయదు. దీని వల్ల తిండి యావ తగ్గి ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే పచ్చి బఠానీల్లో ఉండే పొటాషియం షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. హైబీపీ రాకుండా చూస్తుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున శరీరానికి పోషణ అందుతుంది. కనుక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం పచ్చి బఠానీలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్‌ను చాలా సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు..!
మధుమేహ నివారణకు పచ్చి బఠాణీలు
Related tags :