భార్యభర్తలు ఎప్పటికీ అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఇవి మంచి అన్యోన్య బంధాన్ని ఏర్పరుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
దంపతులు అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్. అవి ఉంటేనే లైఫ్ బోర్ కొట్టకుంటా ఉంటుంది. అయితే, గొడవలు మరీ పెద్దగా కాకుండా ఉండాలి.. ఎప్పటికీ అన్యోన్యంగా కలిసి ఉండాలంటే దంపతులిద్దరూ కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.సాధారణంగా గొడవలు తలెత్తినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అవుతారు. ఆ సమయంలో ఎక్కువగా ఒకరినొకరు బాధపెట్టే మాటలు అనుకుంటారు. ఎక్కువగా గొడవ జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుంటూ దాన్నే పదే పదే గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ కారణంగా లైఫ్ పార్టనర్‌పై నెగేటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా కాకుండా కాస్తా సంయమనం పాటించాలి.గొడవ పడిన తర్వాత చాలా మంది దంపతులు ఇక వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేనట్లు అన్ని విడదీసి మాట్లాడతారు. అప్పటి వరకూ ఉన్న ప్రేమ మొత్తం ఎక్కడికో వెళ్లిపోయినట్టు చిన్న తప్పులని కూడా అద్దంలో పెట్టి చూస్తారు. కానీ అలా చేయకూడదు. ఇంట్లో జరిగిన గొడవల గురించి బంధువులు, స్నేహితులతో చెబుతూ ఉంటారు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి మీరే అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. దీని వల్ల గొడవలు మరింత ముదిరే అవకాశం ఉంటుంది.ప్రతీసారి పాత గొడవలను గుర్తు చేసుకుంటే రివేంజ్ తీర్చుకోవాలనే ఆలోచన ఎప్పుడూ సరికాదు. ఇలాంటివి ఎప్పుడూ కూడా మీ రిలేషన్‌ని దెబ్బతీస్తాయి. అలాంటి ఆలోచనలే చేయొద్దు. వీటిని పక్కన పెట్టి.. మీ మధ్య ప్రేమ పెరిగే మార్గాలను ఆలోచించాలి.భార్య భర్తల బంధం అనేది ఎప్పుడూ కూడా ప్రేమగా, ఆనందంగా ఉండాలి. అంతే కానీ పగ, ద్వేషం రివేంజ్ తీర్చుకోవాలి అన్నట్లుగా ఉండకూడదు. దీని వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.కాబట్టి ఈ ఆలోచన పక్కన పెట్టి ఇద్దరి మధ్య సఖ్యత పెరిగే మార్గాలు ఆలోచించాలి.ఒకరితో ఒకరు సమయం కలిసి గడపండి.. ఇంటిపనులు, వ్యాయామం, బయటికి వెళ్లడం, ఇతర పనులు ఇలా అన్నీ పనులను కలిసి చేయండి. దీంతో ఒకరికొకరు ఎక్కువగా క్లోజ్‌గా అవుతారు. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోండి. ప్రతి విషయాన్ని పంచుకోండి.
*** నమ్మకంతో ఉండండి..
చాలా విషయాల్లోనూ కొంతమంది పార్టనర్స్‌ని కాకుండా పక్కవారిని నమ్ముతారు. ఇది ఎప్పుడూ కరెక్ట్ కాదు.. వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉందో అన్నది చూడాలి. వారి కోణంలో ఆలోచించాలి. వారిని పూర్తిగా నమ్మాలి.
*** నిందలు మోపద్దు..
ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు పార్టనర్‌దే తప్పు అన్నట్లు మాట్లాడకూడదు. జరిగిన దానికి లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని ఆ విధంగా మాట్లాడాలి. అంతేకానీ, ఎదుటివారిపై నిందలు మోపడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.. ఉన్న బంధాన్ని బలహీనం చేసుకోవడం తప్పా..
*** ఆసక్తిగా వినండి..
పార్టనర్ మీ దగ్గర ఏదైనా విషయం చెబితే దానిని పెడ చెవిన పెట్టడం సరికాదు. వారు ఏ విషయం చెప్పిన ఆసక్తిగా వినాలి. అలా వినకుంటే..ఈ తీరు మీ తీరుపై అనుమానం వచ్చేస్తుంది. ఏది చెప్పుకోవడానికి కూడా ఆసక్తి చూపరు. అందుకే ఏ విషయమైనా ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవాలి. కలిసి పరిష్కరించుకోవాలి.
*** అర్ధం చేసుకోవడం కూడా ముఖ్యమే..
ఏ విషయంలోనైనా పార్టనర్‌ని అర్ధం చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ సమయంలో వారు ఏదైనా అభ్యంతరకరంగా బిహేవ్ చేస్తే అందుకు కారణాలు ఏటో తెలుసుకోండి. వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆ సమస్య గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. వారిలోని సానుకూలతల్ని గమనిస్తే సంతోషంగా ఉండొచ్చు.
*** మీ సమస్య ఏంటో చెప్పండి..
ఏదైనా విషయంలో మీ పార్టనర్‌తో ఏదైనా ఇబ్బందిగా ఉంటే.. ఆ విషయాన్ని వారితో నేరుగా చెప్పండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సద్దుమణుగుతాయి.
*** మీ ప్రేమను వ్యక్తపరచండి..
భార్యభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమ ఉంటుంది. కానీ, అది వ్యక్తపర్చరు. కోపాన్ని ఎంతో సులభంగా తెలిపే మనం.. ప్రేమని ఎందుకు తెలపలేం.. అందుకే.. ప్రేమను వ్యక్తపరచడం చేయండి. దీని వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత గాఢంగా మారుతుంది. దీనికోసం ప్రతీసారి పెద్దగా గిఫ్ట్‌లు, డబ్బులు ఖర్చుపెట్టడం కాదు.. మాటలతో చెప్పొచ్చు. కౌగిలితంతలో కూడా మీ భావాలను వ్యక్త పరచొచ్చు. మీ మాటల్లోనూ ఆఫీస్ విషయాలు, ఫైనాన్షియల్ థింగ్స్ కాకుండా సరదా మాటలు ఉండడం మంచిది.
*** ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి..
చాలా మంది దంపతులు చేసే తప్పులు ఫ్యామిలీతో సమయం కేటాయించకపోవడం.. కానీ, అలా ఎప్పుడూ చేయకూడదు. మీ ఫ్యామిలీతో సమయం కేటాయించండి. సెలవులు వస్తే ఆ సమయంలో ఇంట్లోనే కాకుండా బయటికి వెళ్లి రండి.. దీంతో ఫ్యామిలీ లైఫ్‌తో పడుతున్న ఇబ్బందులు చాలా వరకూ దూరం అవుతాయి.ఏ బంధమైనా సరే ప్రేమ, నమ్మకం వంటి వాటితోనే కలకాలం ఆనందంగా ఉంటాయి. ముఖ్యంగా దాంపత్యం కాబట్టి ఈ విషయంలో మీరు మీ పార్టనర్‌కి బలంగా మారాలి. అంతేగానీ, బలహీనతగా మారకూడదు. ఒకరినొకరూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రతీ విషయంలోనూ తోడుగా నిలవాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. గొడవలు రావడం సహజం. వచ్చినప్పుడు సంయమనం పాటించాలి.