ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టకముందు తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయకుడు అంటే చిత్తూరు నాగయ్య. అప్పట్లోనే ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా భక్తిరస చిత్రాల్లో ఆయన నటన అజరామరం. ‘గృహలక్ష్మి’, ‘వందేమాతరం’, ‘భక్తపోతన’, ‘త్యాగయ్య’, ‘యోగి వేమన’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ విభిన్న పాత్రల్లో రాణించారు. ‘భక్తపోతన’(1942) చిత్రంలో పోతనగా నటించిన చిత్తూరు నాగయ్య శ్రీరామ భక్తులుగా మారిపోయారు. మాట్లాడుతున్నప్పుడల్లా, ఏదో ఒక సందర్భంలో ‘రామ’ శబ్దం ఉచ్చరిస్తూనే ఉండేవారు. కాల క్రమంలో ‘అగ్గిరాముడు’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో ‘రాముడు’ పేరులో విజయం ఉందని నిర్మాతలు నమ్మి, ఆ పేరు కలిసేలా సినిమాలు తీశారు. ‘దొంగరాముడు’, ‘భలేరాముడు’, ‘శభాష్‌రాముడు’, ‘బండరాముడు’ ఇలా రాముడి పేరుతో వరుస చిత్రాలు తీశారు. తాను ఆరాధించే రాముడితో ఈ సినిమా పేర్లేమిటని చిత్తూరు నాగయ్య చాలా బాధపడ్డారట. ‘‘రామా! నిన్ను దొంగరాముడన్నారు.. అగ్గిరాముడన్నారు.. శభాష్ రాముడన్నారు.. ‘బండరాముడు’ అని కూడా అన్నారు. చివరికి నువ్వు ‘బండ’గా కూడా మారిపోయావా శ్రీరామా’’ అంటూ బాధపడేవారట.
శ్రీరామా!
Related tags :