నాయికా ప్రాధాన్య చిత్రాలతో మెప్పించిన కంగనా రనౌత్ మరో విభిన్న చిత్రంతో రాబోతోంది. అదే ‘పంగా’. ఇందులో కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించబోతోంది కంగన. ఈ చిత్రానికి అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకురాలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. భారత మహిళా కబడ్డీ జట్టులో స్థానం సంపాదించుకోవాలని కలలు కనే జయానిగమ్ అనే మహిళగా కంగన నటించింది. అయితే ఆమె కోరిక తీరకుండానే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. మూడు పదులు దాటిన వయసులో, ఓ తల్లిగా కుమారుడి ఆలనా పాలనా, ఓ భార్యగా భర్త బాగోగులు చూసుకుంటూ జీవితం గడిపేస్తున్న ఆమెకు మళ్లీ కబడ్డీ ఆడాలన్న ఆశ పుడుతుంది. క్రీడల నుంచి రిటైర్ అయ్యే వయసులో ఉన్న ఆమె మళ్లీ కబడ్డీ జట్టులో స్థానం సంపాదించాలని ప్రయత్నిస్తుంది. మరి ఆమె ప్రయత్నం ఫలించిందా? ఆమె ప్రయాణంలో కుటుంబం నుంచి మద్దతు లభించిందా? తల్లిగా మారినవారికి మళ్లీ తమ లక్ష్యాలను అందుకునేందుకు రెండో అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారు అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. జనవరి 24న విడుదల చేయనున్నారు.
అవకాశం బలం తెలిపే చిత్రం…
Related tags :