సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పేను భారత్‌లో చాలా మంది ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాప్‌లో అనేక మంది నగదు ట్రాన్స్ఫర్, బిల్లు చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ తన గూగుల్ పే కస్టమర్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. అవేమిటంటే…
* గూగుల్ పే వినియోగదారులు తమ యూపీఐ పిన్ నంబర్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవాలి. ఎవరికీ ఆ పిన్ను చెప్పకూడదు.
* గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ పే యాప్‌ను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని వాడాలి. అలాగే కస్టమర్ కేర్‌ను సంప్రదించాల్సి వస్తే యాప్‌లో ఇచ్చే నంబర్లకే ఫోన్ చేయాలి.
* గూగుల్ పే యాప్‌లో మనీ రిక్వెస్ట్ వస్తే వెంటనే స్పందించకూడదు. వినియోగదారులకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు ముందుగా డబ్బు కావాలని అడిగి.. ఆ తరువాత రిక్వెస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేకానీ.. అపరిచితులు మనీ రిక్వెస్ట్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు.
* గూగుల్ పే కస్టమర్ ప్రతినిధినంటూ మాట్లాడుతూ కొందరు వినియోగదారుల బ్యాంక్ సమాచారం తెలుసుకునేందుకు యత్నిస్తారు. అలాంటి వారికి వివరాలు చెప్పకూడదు. నిజంగా ఎవరూ కూడా.. వినియోగదారులను ఆ వివరాలు అడగరు.
* వినియోగదారులకు తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వివరాలను వెరిఫై చేసుకోవాలంటూ కొందరు కాల్స్ చేస్తారు. అలాంటి వారికి సమాధానం చెప్పకూడదు.
* ఎనీడెస్క్ లేదా టీం వ్యూయర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కొందరు కాల్స్ చేస్తారు. నిజానికి ఈ యాప్‌లను ఎవరూ ఫోన్లలో వాడకూడదు. ఆ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినా స్పందించకూడదు.
* డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వివరాలు చెప్పకపోతే బ్లాక్ అవుతుందని కొందరు బెదిరిస్తారు. అలాంటి వారికీ బదులివ్వరాదు.