ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం ఛైర్మన్ నితిన్ రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంచలన లేఖ రాశారు. చెరకు తోటల్లో పనిచేస్తున్న 30వేల మంది పేద కూలీలు తమ గర్భాశయాలను తొలగించుకున్నారని నితిన్ రౌత్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రుతు సమయంలో పేద మహిళలు కూలీ పనికి వెళ్లలేక పోవడం వల్ల వేతనాలు రావనే భయంతో చెరకు తోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలు హిస్టరెక్టమీ శస్త్రచికిత్స చేయించుకొని తమ గర్భాశయాలను తొలగించుకున్నారని నితిన్ రౌత్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ భూమి లేని నిరుపేద మహిళలు తమ జీవనం కోసం చెరకు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. జీవనాధారం కోసం తమ గర్భాశయాలను తొలగించుకున్న మహిళలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను నితిన్ రౌత్ కోరారు.
పనికోసం గర్భాశయాలు తొలగించుకున్న మహిళా కూలీలు
Related tags :