షాక్.. బంగారం ధర భారీ జంప్.. దీనికి రెట్టింపు పెరిగిన వెండి!
పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం కూడా బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మళ్లీ ఈసారి ఏకంగా రూ.210 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.36,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 పెరుగుదలతో రూ.39,960కు ఎగసింది.
4 రోజులుగా పైపైకి
బంగారం ధర వరుసగా 4 రోజులుగా పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.380 మేర పెరిగింది. డిసెంబర్ 20న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.36,290 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,590 వద్ద ఉంది. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం నిజం ప్రతికూల అంశమని చెప్పొచ్చు.
వెండి రయ్ రయ్
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా మరింత పైకి కదిలింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.440 పెరిగింది. దీంతో ధర రూ.47,300కు చేరింది. మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర నిన్న, ఈ రోజు పెరుగుతూ రావడం గమనార్హం.
కారణాలు ఇవే..
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధర క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. అంతేకాకుండా ఆర్థిక మాంద్య భయాలు మళ్లీ మొదలుకావడం, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పరుగులు పెట్టడం వంటి అంశాలు కూడా పసిడి పరుగుకు దోహపడుతున్నాయి.
ఢిల్లీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్
ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.37,450కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.38,650కు ఎగసింది. కేజీ వెండి ధర కూడా పరుగులు పెట్టింది. రూ.440 పెరుగుదలతో రూ.47,300కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో..
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా పెరిగింది. మళ్లీ 1,500 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. పసిడి ధర ఔన్స్‌కు 1.05 శాతం పెరుగుదలతో 1,504.40 డాలర్లకు చేరింది. ఇది 7 వారాల గరిష్ట స్థాయి. అదేసమయంలో వెండి ధర 2.01 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 17.85 డాలర్లకు ఎగసింది.
ఆరేళ్ల గరిష్టానికి
ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.
భారత్‌లో 20 శాతం ర్యాలీ
మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.
బంగారం ధరపై వీటి ప్రభావం
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.