NRI-NRT

బధిరుల పాఠశాలకు ఆటా ఆర్థిక సాయం

ATA 2019 Vedukalu Helps School For Disabled In Hyderabad

ఆటా వేడుకల్లో భాగంగా ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు హైదరాబాద్‌లోని బధిరుల పాఠశాలను సందర్శించారు. సాంస్కృతిక, వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపకారవేతనాలు, వాణిజ్యం తదితర రంగాలపై ఆటా వేడుకల్లో భాగంగా సదస్సులు నిర్వహించగా సేవా రంగ కార్యక్రమాల్లో భాగంగా ఈ బధిరుల పాఠశాలను అధ్యక్షుడు భీంరెడ్డి పరమేష్, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాలల ఆధ్వర్యంలోని ఆటా బృందం సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. రెండంతస్థులు కలిగిన ఈ భవనంలో 5గదుల్లో 17మంది అధ్యాపకులతో కలిసి 110కు పైగా బాలబాలికలు నివసిస్తూ, విద్యనభ్యసిస్తూ ఆశ్రయం పొందుతున్నారని, నెలకి ₹3లక్షలు ఖర్చు అయ్యే ఈ పాఠశాలలోని వసతుల మెరుగునకు ఆటా ఆధ్వర్యంలో చేయూతనిస్తామని పరమేశ్ తెలిపారు. తొలివిడతగా ₹లక్ష రూపాయలను అందజేశారు. వీరికి స్పీచ్ థెరపీ ద్వారా విద్యా బోధన జరిగేలా సాయమందిస్తామని, ₹2లక్షలు ఖరీదు చేసే ఆ థెరపీ కిట్‌ను అందజేస్తామని భువనేశ్ తెలిపారు.