చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కువగా లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. కచ్చితంగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తుంది. ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉసిరికాయల్లో విటమిన్ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్ సి మనకు ఉసిరికాయల్లోనే దొరుకుతుంది. అందుల్ల ఈ సీజన్‌లో ఉసిరికాయలను తీసుకుంటే విటమిన్ సి లోపం రాకుండా చూసుకోవచ్చు.
2. ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా చూస్తుంది.
3. శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
5. శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.