భార్యభర్తలు కౌగిలింతలతో ఎక్కువ రోజులు బతుకుతారట..
కౌగిలింత.. ఇది భాషకి అందని ఓ అనుభూతి అని చెబుతారు చాలా మంది. అవును అన్ని పనుల్లానే ఇది సర్వసాధారణం అనుకుంటారు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఈ ఆత్మీయ స్పర్శతో చెప్పొచ్చని చెబుతారు శాస్త్రవేత్తలు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండోయ్.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
హగ్‌తో ఆరోగ్యం..
ఓ సినిమాలో హీరో బాధలో ఉన్నవారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటారు. దీంతో వారిలో బాధ చాలా వరకూ తగ్గుతుందని అక్కడ లాజిక్.. ఇది సినిమాలో మాత్రమేనని నిజమనుకోకండి.. నిజంగానే నిజం.. అవును.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల శారీరకరంగా, మానసికంగా ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. అయితే, మన దగ్గర ఇంకా అంతగా లేదు కానీ, మిగతా దేశాల్లో ఒకరినీ ఒకరు ప్రేమగా కౌగిలింతలో పలకలరించుకుంటారు. ఇది చాలా మంది గమనించే ఉంటారు. మన దగ్గర ఈ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. మనం అత్యంత సన్నిహితులకి మాత్రమే కౌగిలింతలు ఉంటాయి. అయితే, ఈ కౌగిలింతల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది.
రోజంతా పనితో సతమతమవుతున్నారా..
చాలా మంది రోజంతా పనిచేస్తూనే ఉంటారు. అది శారీరకంగా కావొచ్చు.. మానసికంగా కావొచ్చు. దీని వల్ల త్వరగా అలసిపోతారు. అయి, ఆ సమయంలో ఆలింగనం చేసుకుంటే చాలా వరకూ ఆ వ్యయప్రయాసలు అన్నీ దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్క హగ్‌తో ఎంతో రిలాక్స్ అవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక, శారీరక ఒత్తిడిలు అన్నీ కూడా ఒక్క కౌగిలింతతో దూరం అవుతాయని చెబుతున్నారు.
ఆయుష్షు పెరగుతుంది..
మరో ముఖ్య విషయం ఏంటంటే.. భార్య భర్తలు కౌగిలించుకుంటారు.. అయితే.. నిత్యం ఇలా ఆలింగనం చేసుకోవడం వల్ల దంపతులు ఎక్కువ కాలం బ్రతుకుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేనా.. చూడడానికి కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు. కాబట్టి భార్య భర్తలు రోజుకు ఒకసారైనా తమ పార్టనర్‌ని ప్రేమతో హగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
గుండెనొప్పులు, షుగర్ దూరం..
గుండె సమస్యలు, షుగర్, బీపీ ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ కారణం ఒత్తిడి, డిప్రెషన్ ప్రధాన కారణంగా ఉంటుంది. అయితే, కౌగిలించుకోవడం వల్ల చాలా వరకూ ఈ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ కూడా నాశనమవుతాయి.. దీంతో చాలా వరకూ శీరరంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయి.
అదుపులో బరువు..
కౌగిలించుకోవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దగ్గు, ఫ్లూ జ్వరం వంటి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయని చెబుతున్నారు. కౌగిలించుకోవడం వల్ల ఎకకకువగా కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో త్వరగా బరువు తగ్గుతారని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
కారణం ఇదే..
కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనలో రిలాక్స్‌ని పెంచుతాయి. దీంతో ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. డిప్రెషన్, ఒత్తిడిలు తగ్గిపోతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలాగే హైబీపీ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్, నొప్పులు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా మనం ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు మనలోని థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుందట. దీంతో మన శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.