ScienceAndTech

2019లో ఈ యాప్స్‌దే మొదటి స్థానం

Most downloaded apps of 2019 list is here

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో మైలురాయిని అందుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్లు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్‌ క్రేజ్‌ను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. యాప్‌ యానీ అనే యాప్‌ సంస్థ ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ జాబితాను రూపొందించింది. ఆన్‌లైన్‌ డిజిటల్‌ స్పేస్‌లో ఎక్కువగా యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్ చేసిన వాటిని పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని జాబితాలు రూపొందిస్తామని యాప్‌ యానీ సంస్థ పేర్కొంది.

యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ జాబితా:

ఫేస్‌బుక్‌
ఫేస్‌బుక్‌ మెసేంజర్‌
వాట్సాప్‌
ఇన్‌స్టాగ్రామ్‌
స్నాప్‌చాట్‌
టిక్‌టాక్‌
యూసీ బ్రౌజర్
యూట్యూబ్‌
ట్విటర్‌