Business

విస్తారాలో ఇంటర్నెట్ సౌకర్యం

Vistara Airlines To Offer Internet In Their Flights

విస్తార ఎయిర్‌లైన్స్‌ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు.