దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న బ్యూటీ పూజా హెగ్డే. ఈ ఏడాది ఆమె ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘హౌస్‌పుల్ 4’ చిత్రాలతో హిట్లు అందుకున్నారు. ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో..’ జనవరి 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ భామ ఓ ఆంగ్ల పత్రికతో ముద్దు సన్నివేశాల గురించి ముచ్చటించారు. అలాంటి సీన్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటామని పేర్కొన్నారు. ‘మొహంజోదారో’ సినిమాలో హృతిక్ రోషన్‌కు ముద్దుపెట్టిన సీన్‌ను గుర్తు చేసుకున్నారు. ‘ముద్దు సన్నివేశాలు వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులకు బాగుంటాయి. కానీ.. ఆ సీన్‌లో నటించేందుకు మేం ఎంత కష్టపడతామో ప్రజలకు తెలియదు. హృతిక్‌తో ముద్దు సీన్ ఉందని షూట్‌కు ముందు దర్శకుడు అశుతోష్ గోవారికర్ నాకు వివరించారు. నేను కూడా లిప్‌లాక్ సీన్‌కు సిద్ధమయ్యా. కానీ, నాకు వణుకు పుట్టింది. దానికి ముందు నేను అలాంటి సీన్లు చేయలేదు. మా చుట్టూ చాలా మంది జనాలు నిలబడి ఉన్నారు. నాకు చాలా కష్టంగా అనిపించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ప్రధాన తారాగణం మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. దీన్ని పక్కనపెడితే.. కెమెరా ట్రిక్స్ కూడా ఈ సీన్ల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి వల్ల ఇలాంటి ఇబ్బందికర సంఘటనల నుంచి మేం తప్పించుకుంటుంటాం’ అని పూజా అన్నారు. పూజా ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా ‘జాన్’ సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకుడు.
ముద్దు సీన్లు సులువు కాదు
Related tags :