జావా సంస్థ మార్కెట్లో తీసుకురానున్న సరికొత్త బైకు పెరాక్ బుకింగ్స్ జనవరిలో మొదలుపెట్టనుంది. ఇప్పటికే నవంబర్‌లో ఈ సంస్థ బైకు ధరను రూ.1.94 లక్షలుగా వెల్లడించింది. ఇక బైకు డెలివరీలను మాత్రం ఏప్రిల్‌లో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇవి జులై వరకు కొనసాగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బుకింగ్స్‌ను స్వీకరించనుంది. కస్టమర్లను నెలలతరబడి వెచిఉంచకుండా ఈ నిర్ణయం తీసుకొంది. ఈ బైకును బొబ్బెర్ డిజైన్‌లో తయారు చేయడంతో చూడటానికి ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతానికి భారత్‌లో విక్రయించే చౌకఅయిన బొబ్బెర్ బైకు ఇది.
జావా బండి బుకింగ్‌లు ప్రారంభం
Related tags :