బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ నటించిన నేహా ధుపియా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడ హీరోతో పోల్చితే హీరోయిన్ను తక్కువ చేసి చూస్తారని ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తరుణ్, శ్రీదేవి, అనిత ప్రధాన తారాగణంగా రూపొందిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో నేహా అతిథి పాత్రలో కనిపించారు. అదేవిధంగా ‘విలన్’, ‘పరమ వీరచక్ర’ సినిమాల్లో కథానాయికగా అలరించారు. కాగా సౌత్ సినిమా షూటింగ్లో జరిగిన సంఘటనను ఆమె తాజాగా ప్రస్తావిస్తూ.. ‘చాలా ఏళ్ల క్రితం నేను దక్షిణాది సినిమా చేస్తున్నప్పుడు.. నిర్మాతలు ముందు హీరోకే భోజనం ఏర్పాటు చేసేవారు. ఓసారి నేను చాలా ఆకలితో ఉన్నా. హీరో షాట్లో ఉన్నారని, కాబట్టి ముందు ఆయనే తినాలని అన్నారు. ఇలాంటి వికారమైన సంఘటనలు కూడా జరిగాయి. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. ఇలాంటివి అస్సలు ఎప్పుడు జరగకూడదు. సెట్లో ఒక్కరోజు మాత్రమే నాకు ఈ పరిస్థితి ఎదురైంది. అది చూసి నేను నవ్వుకున్నా.. నన్ను ఇది ఏ మాత్రం బాధించలేదు’ అని ఆమె తెలిపారు. నేహా ధుపియా ప్రస్తుతం సెలబ్రిటీ ఛాట్ షోతో బిజీగా ఉన్నారు. ఈ షోకు ఆమె చిత్ర పరిశ్రమలోని తన స్నేహితుల్ని ఆహ్వానిస్తుంటారు. ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడూ వినని కొత్త విషయాలను వారి ద్వారా చెప్పిస్తుంటారు.
దక్షిణాదిలో దారుణమైన వివక్ష
Related tags :