తెలుగురాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనంగా మారారు.
టీడీపీ, వైసీపీ అధినేతలపై మండిపడ్డారు. తన విచిత్ర చేష్టలతో పలువురిని కడుపుబ్బా నవ్వించిన సందర్భాలు కూడా లేకపోలేదు.
ఆయన వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి పలువురిని ఆకట్టుకున్నారు.
ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే తన పార్టీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు.
ఇప్పటివరకు ప్రజాశాంతి పార్టీదే గెలుపని చెప్పిన ఆయన… ఇప్పుడు మాత్రం నరసాపురంలో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నారు.
నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ… ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ జోస్యం చెప్పారు.
ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు.
అవినీతిపై యుద్ధానికి యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వందలాది మంది యువత వస్తే దీక్ష చేపడతానని కేఏ పాల్ చెప్పారు