Devotional

తితిదే ఆలయ అర్చకుల మధ్య చిచ్చు

TTD Priests Fighting In Front Of Devotees

తిరుమల శ్రీవారి లడ్డూపై ఇప్పటిదాకా ఇస్తున్న రాయితీని ఎత్తివేసేందుకు తితిదే ఉపక్రమించింది. అదే సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం టోకెన్‌ అందించనుంది. జనవరి 6న వైకుంఠ ఏకాదశి నుంచి ఈ విధానం అమలు లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూను తితిదే అందిస్తోంది. ఈ కోటాలో నిత్యం 20 వేల మందికి పంపిణీ చేస్తోంది. దివ్యదర్శనం, టైంస్లాట్‌, సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు రెండు లడ్డూలు రూ.10, మరో రెండు రూ.25 ధరతో మొత్తంగా రూ.70కి నాలుగు లడ్డూలు ఇస్తోంది. తితిదే ఉద్యోగులకు రూ.5 చొప్పున విక్రయిస్తోంది. రూ.300 టిక్కెట్‌పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్‌దర్శనం, విశేష ఆర్జిత సేవలకు వచ్చి దర్శించుకునేవారికి రెండేసి లడ్డూలను ఉచితంగా ఇస్తోంది. ఇకపై ఈ రాయితీలన్నింటినీ ఎత్తేస్తూ ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి.. రూ.50 చొప్పున కోరుకున్నన్ని లడ్డూలు విక్రయించనుంది. కల్యాణం పెద్ద లడ్డూనూ సామాన్యభక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇటీవలి తితిదే బోర్డు సమావేశంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సభ్యులు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు సమాచారం. తితిదే ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నా.. అదనపు ప్రసాదంపై రాయితీ తొలగించడంతో భక్తులు తయారీ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ కుటుంబంలోని ఐదుగురు భక్తులు టైంస్లాట్‌ దర్శనం చేసుకుంటే రాయితీ మీద ఒక్కొక్కరికి రూ.70కి నాలుగు లడ్డూలు ఇచ్చేవారు. అంటే ఐదుగురికి కలిపి రూ.350 చెల్లిస్తే 20 లడ్డూలు వచ్చేవి. ఇప్పుడు ఐదుగురికి ఐదు లడ్డూలు ఉచితంగా ఇవ్వగా.. మరో 15 లడ్డూలు కావాలంటే ఒక్కోటి రూ.50 చొప్పున రూ.750 చెల్లించాలి. కాలినడకన వచ్చినవారికి యథాతథంగా ఒక లడ్డూ ఉచితంగా వస్తుంది. తిరుమలకు నిత్యం సుమారు 75వేల నుంచి 80వేల మంది భక్తులు వస్తుండగా.. సుమారు 3 లక్షల లడ్డూలు అందజేస్తున్నారు. ఒక్కో లడ్డూ తయారీకి సుమారు రూ.40 ఖర్చవుతోందన్నది తితిదే వాదన. ఇందుకోసం ఏటా రూ.580 కోట్లు వెచ్చిస్తోంది. ప్రసాదంపై రాయితీ వల్ల ఏటా దాదాపు రూ.250 కోట్లకు పైగా భారం పడుతోందని లెక్కతేల్చిన దేవస్థానం.. తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధానార్చకులు, గౌరవ ప్రధానార్చకుల మధ్య స్వల్పవివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సమయంలో ఈ వివాదం మొదలైంది. ఇటీవల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులుగా నియమితులైన రమణ దీక్షితులు బయటినుంచి నెయ్యి తీసుకొచ్చి దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధమని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అభ్యంతరం చెప్పారు. దీనిపై రమణ దీక్షితులు ‘ఇందులో వివాదమేముంది. అసలు నాకు చెప్పడానికి నీవెవరు? ఎక్కడ చెప్పాలో నాకు తెలుసు’ అంటూ బదులిచ్చారని సమాచారం. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వైకాపా ప్రభుత్వం తితిదేని భ్రష్టుపట్టిస్తోందని తితిదే మాజీ సభ్యుడు ఏవీ రమణ ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘భక్తుల ముందే అర్చకులు వాగ్వాదానికి దిగితే ఆలయ ప్రతిష్ఠ ఏం గాను? వీఐపీ దర్శనం పేరుతో టికెట్ల వ్యాపారం, లడ్డూ ధర, వసతిగృహాల ధరలు పెంచాలనే నిర్ణయం, గొల్ల మండపం తరలింపు.. ఇలా 7 నెలల వైకాపా పాలనలో తితిదేలో జరిగిన తప్పులు చరిత్రలో ఎప్పుడూ లేవు’’ అన్నారు