* దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటాసన్స్ నేడు ఎన్సీఎల్ఏటీ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 18 సైరస్ మిస్త్రీకి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ తీర్పును వెలువరించింది. టాటాసన్స్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా, టీసీఎస్, టాటా ఇండస్ట్రీస్, టాటా టెలిసర్వీస్‌లకు డైరెక్టర్‌గా నియమించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జనవరి 6న న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది. టీసీఎస్ బోర్డుమీటింగ్ జనవరి 9న జరగనుండటంతో సత్వర ఉపశమనం కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
*ట్రాయ్ షాక్; ఆ షేర్లు ఢమాల్
కేబుల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా ట్రాయ్ తీసుకొచ్చిన టారిఫ్ నిబంధనల సవరణలు కేబుల్ టీవీ ఆపరేటర్లకు షాక్ ఇచ్చాయి. స్టాక్మార్కెట్లో టీవీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కేబుల్ , ప్రసార సేవల కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ట్రాయ్ సవరణలు చేసిన తరువాత గురువారం ఆపరేటర్ల షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. సన్ టీవీ నెట్వర్క్ 6.37 శాతం, డెన్ నెట్వర్క్స్ 3.90 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 2.99 శాతం, డిష్ టీవీ ఇండియా 0.85 శాతం కుప్పకూలాయి. మరోవైపు సెన్సెక్స్ 232 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో 2017 టారిఫ్ నిబంధనలను సవరించిన ట్రాయ్ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే.
*ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు నేడు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఏప్రిల్ 2023 వరకు గడువు ఉన్న బాండ్లు రూ.1,001- రూ.1,000 మధ్య, ఏప్రిల్ 2030 వరకు ఉన్న బాండ్లు రూ.1,004.90- రూ.1,000.40 మధ్య లిస్టయ్యాయి. ఆఫర్ ధర రూ.1,000గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన ఆఫర్‌ను డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఇష్యూను నిర్వహించారు. ఇలా సేకరించిన నిధులను పీఎస్‌యూల విస్తరణకు వినియోగిస్తారు. ఈ ఇష్యూ నుంచి రూ.7,000 కోట్లు సమీకరించినట్లు అంచనా
*ఈ ఏడాది భారత జీడీపీ 5 శాతం మేర వృద్ధి చెందడమూ కష్టమేనని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే అన్నారు.
*తప్పుడు పత్రాలతో రుణం తీసుకుని బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడితోపాటు అతడి బంధువులకు చెందిన రూ.51.43 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
*లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు కాస్త ఊరట లభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 15 బ్యాంకుల కన్సార్షియం మాల్యా రుణ తిరిగి చెల్లింపుల కోసం ఆయన చరాస్తులను వాడుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. ఈ ఆస్తుల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీలైన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) షేర్లు వంటివి ఉన్నాయి.
*గత ఏడాది (2019) ఆంధ్రప్రదేశ్‌లో 525 కంపెనీల మూసివేతకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి దరఖాస్తు చేసుకున్నాయి. అనుకున్న విధంగా నిధుల సమీకరణ చేయలేకపోవడం, ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడం, ఊహించిన విధంగా ప్రభుత్వ ప్రాజెక్టులు చేతికి రాకపోవడం, నష్టాలు తదితర కారణాలతో ఈ కంపెనీలు మూతపడ్డాయి.
*విమానయాన సంస్థ ఇండిగో మంగళవారంనాడు మరో నాలుగు నియో విమానాలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో 250కి పైబడి విమానాలు కలిగి ఉన్న ఏకైక విమానయాన సంస్థ ఇది. అలాగే ఈ ఘనత సాధించిన తొలి విమానయాన సంస్థ కూడా.
సుప్రీంకోర్టు తలుపు తట్టిన టాటా-వాణిజ్యం
Related tags :