DailyDose

జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశం..హాజరు కావాల్సిందే-తాజావార్తలు

CBI Court Mandates Jagan To Attend Court-Telugu Breaking News Roundup Daily Today

* అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకావాల్సిందేనని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది. నాంపల్లిలోని న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఇవాళ హాజరు నుంచి జగన్‌, విజయసాయిరెడ్డి మినహాయింపు కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పదేపదే మినహాయింపు కోరడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 10న (వచ్చే శుక్రవారం) విచారణకు హాజరుకావాలని జగన్‌, విజయసాయిరెడ్డిలను ఆదేశించింది.
* ఏపీ లో జిల్లా పరిషత్ ల చైర్ పర్సన్ క్యాటగిరికి సంబంధించిన గెజిట్ విడుదల చేసిన పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ గిరిజ శంకర్.జిల్లాల వారీగా రిజర్వేషన్లు:శ్రీకాకుళం – జనరల్ జయనగరం – ఎస్సి ( మహిళ ) శాఖపట్నం – బీసీ ( మహిళ )వెస్ట్ గోదావరి – బీసీ ( మహిళ )ఈస్ట్ గోదావరి – జనరల్ ( మహిళ )కృష్ణ జిల్లా – బీసీ
గుంటూరు – జనరల్ ( మహిళ )ప్రకాశం జిల్లా – జనరల్ నెల్లూరు జిల్లా – ఎస్టీ కర్నూల్ – జనరల్ ( మహిళా ) వై ఎస్ ఆర్ జిల్లా – జనరల్ చిత్తూర్ –బీసీ అనంతపురం – ఎస్సి.
* రాజధాని ప్రాంతం మందడంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ అక్కడి రైతులు, మహిళలు మండిపడుతున్నారు. తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేపు రాజధాని అమరావతి బంద్ కు రైతులు పిలుపు నిచ్చారు.
* పంచాయతి, మునిసిపల్ ఎన్నికలపై హై కోర్టులో విచారణ7వ తేదీలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలనీ గడువు ఇచ్చిన కోర్టు. 8వ తేదీన ఎన్నికల షెడ్యూలు సమర్పించాలని ఆదేశం. 8వ తేదికి విచారణ వాయిదా
* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుండ బద్దలుకొట్టారు. సీఏఏపై రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
* నిత్యం బిజీ గా వుండే జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య పరీక్షలు శుక్రవారం చేయించు కున్నారు. ఇక్కడ కంటి పరీక్ష విభాగానికి గతంలో అత్యుత్తమ పురస్కరం లభించింది.
* ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేశినేని మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
* తమను కాదని జూనియర్ అయిన సోమేశ్ కుమార్కు కొత్త సీఎస్గా చాన్సివ్వడంపై కొందరు సీనియర్ ఐఏఎస్లు కినుక వహించినట్టు తెలిసింది. సీనియారిటీ ఉన్నా, తగిన అర్హతలున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడంపై పలువురు స్పెషల్సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు అలక వహించినట్టు సమాచారం.
* ఓవైపు ఏలూరులో సీఎం జగన్… రాజధాని తరలింపునకు అనుకూలంగా సంకేతాలిస్తూ… ప్రకటన చెయ్యడంతో… అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి.
* అమెరికా విమానాలు సాధ్యమైనంత వరకు పాక్ మీదుగా వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించాలని విమానయాన సంస్థలకు అగ్రరాజ్యం ఆదేశాలిచ్చింది. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలపై దాడులు జరగొచ్చని అమెరికా అభిప్రాయపడింది.
* ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో కొన్ని రాష్ట్రాల శకటాలకు చోటు దక్కకపోవడం వివాదానికి దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే భాజపాయేతర రాష్ట్రాల శకటాలను ప్రభుత్వం తిరస్కరించిందని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అయితే సమయాభావం కారణంగా అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని, నిపుణుల కమిటీ ఎంపిక చేసి వాటికే అనుమతినిచ్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
*విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా.
*భారతీయ రైల్వే తన హెల్ప్‌లైన్‌ నంబర్లన్నింటినీ 139లో కలిపేసింది. ఇకపై రైల్వే ప్రయాణికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి 139కు డయల్‌ చేయవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
*మూడు టీ20ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు గురువారం భారత్‌లో అడుగుపెట్టింది. టీమిండియాతో జరిగే తొలి మ్యాచ్‌కు గువాహటి వేదిక కానుంది. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో లంక ఆటగాళ్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు బస చేసే హోటల్‌కు చేర్చారు.
*సీఏఏపై దేశప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా అగ్రనేతలు సిద్ధమయ్యారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్లోని జోధ్పుర్లో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తారని కమలనాధులు ఆశిస్తున్నారు
*పల్లెప్రగతి-2లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
*ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.
*నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం వెంకన్న ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు గురువారం దర్శించుకున్నారు.
*కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్యవిద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇచ్చే పట్టాకు కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు తెలంగాణలోని వైద్యకళాశాలల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరిటనే పట్టా ధ్రువపత్రాన్ని అందజేస్తున్నారు.
*రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ప్రగతి భవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆయన రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డైరీని ఆవిష్కరించారు.
*స్వైన్ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా బడి పిల్లల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ గురువారం నిర్ణయించింది. పాఠశాలలో ప్రతిజ్ఞ సమయంలో వైద్యాధికారులు స్వైన్ఫ్లూ నివారణ చర్యలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు
*విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ఆచార్యులు ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త పింఛను అందుకోనున్నారు
*గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర-2020ను ప్రారంభిస్తున్నట్లు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు.
*రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబరు 23న జారీ చేసిన ఎన్నికల షెడ్యూలును సవాలు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఈనెల 6కు వాయిదా పడింది. రిజర్వేషన్లను ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూలు జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
*రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠాధామాలు, డంపింగ్యార్డులతోపాటు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని పల్లెప్రగతి ప్రత్యేకాధికారి, సీనియర్ ఐఏఎస్ శశాంక్గోయల్ ఆదేశించారు. మహబూబునగర్ జిల్లా మూసాపేట మండలం వేముల, సంకలమద్ది గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమ అమలు, చేపట్టిన పనులను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
*యూట్యూబ్లో రాజ్యసభ టీవీని వీక్షిస్తున్న వారి సంఖ్య 40 లక్షలు దాటడంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2017 ఆగస్టులో 4.50 లక్షలు ఉన్న వీక్షకులు 29 నెలల్లోనే 888 శాతం మేర పెరగడం సంతోషకరమని పేర్కొన్నారు.
*త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తన తొలి నిర్ణయాన్ని తీసుకున్నారు. నింగిలో భద్రతను బలోపేతం చేయడానికి గగనతల రక్షణ కమాండ్ను ఏర్పాటు చేయడానికి జూన్ 30లోగా మార్గసూచీని తయారుచేయాలని ఆదేశాలిచ్చారు. డిసెంబర్ 31 కల్లా పలు లక్ష్యాలకు సంబంధించి ప్రాధామ్యాలను ఆయన నిర్దేశించారు.
*ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న పవనాల వల్ల ఏర్పడిన కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్లో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
* బెంగళూరులో 107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రసంగించిన ఆయన… కొత్త సంవత్సరంలో తన కొత్త కార్యక్రమం… సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై అధ్యయనం నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఇవాళ అందజేసింది. స్ట్రాటజీ ఫర్‌ బ్యాలెన్స్‌డ్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌-బిగ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో రూపొందించిన రిపోర్ట్‌ను బోస్టన్‌ గ్రూప్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌కు అందించింది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.