NRI-NRT

అమరావతి రైతులకు కువైట్ ప్రవాసుల సంఘీభావం

Kuwait NRI Telugus Extends Support To Amaravathi Farmers

గత 18రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్న ఏపీ రాజధాని అమరావతి రైతులకు కువైట్ ప్రవాసులు సంఘీభావం తెలిపారు. అందలూస్ పార్క్‌లో నేడు నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాసులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓలేటి దివాకర్, కోడూరి వెంకట్, పార్థసారధి, మద్దినేని శ్రీనివాసులు, వేగి వెంకటేశ్, పీ.బాబు, వాసు, శేఖర్‌రాజు, రత్నం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.