Movies

నా ప్రేమ ఒంటరిది

Jahnvi Kapoor Speaks Of Her Crush On Vijay

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పడిపోయింది. గతంలోనే విజయ్ పై ఉన్న ఇష్టాన్ని జాన్వీ బయటపెట్టింది. జాన్వి తాజాగా నటి నేహా ధుపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి విజయ్‌ గురించి స్పందించింది. ఆయన తన ఆల్‌ టైమ్‌ క్రష్‌ అని చెప్పింది. దురదృష్టవశాత్తు అటువైపు రియాక్షన్‌ ఏంటో తెలియడం లేదు… నేను ఎక్కువగా ఫీలైపోయి, మాట్లాడిన భావన కలుగుతోంది. కానీ విజయ్‌ నుంచి స్పందనే లేదని తెలిపింది.నా అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతుంటాయన్న జాన్వీ.. విజయ్‌ చాలా స్థిరంగా ఉన్నాడని చెప్పింది. నా అభిమానం కూడా చాలా స్థిరంగా ఉందని.. దీని తర్వాత కొన్ని దశలు ఉన్నాయంది. ఆ దశల గురించి మాట్లాడలేనని, అది తప్పు అంటు తెలిపింది. ప్రస్తుతానికి విజయ్‌పై నాకున్న ఇష్టం సురక్షితమైన జోన్‌లోనే ఉందని… అందుకే నేను దీని గురించి పబ్లిక్‌గా మాట్లాడుతున్నా అంటూ విజయ్ పై ఉన్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టింది జాన్వీ.