సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్థరాత్రి సమయంలో హైటెక్‌సిటీలో ప్రాంతంలో ఓ ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్ చేశాడు. రోడ్డుపై నడుచుకుంటే వెళ్తున్న ఐదు నెలల గర్భిణిపై లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. కీచక అవతారం ఎత్తిన ఎన్‌ఆర్‌ఐ పోకిరిని చితకబాది పోలీసులకు పట్టించింది. 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
హైటెక్ సిటీలో గర్భిణిపై ఎన్నారై దాడి
Related tags :