అల్లం మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు అల్లం నంచీ ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం. వంటల్లో తప్పనిసరిగా వేసే ఐటెమ్స్‌లో అల్లం కీలకమైనది. కూరల నుంచీ ఫ్రైల వరకూ… ప్రతి దాంటో అల్లం వేస్తారు. కారణం రుచికి తోడు… అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ప్రధానంగా అల్లం… మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది. అంతే కాదు… అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మనం తినే ఆహారంలో అల్లం ఉంటే… ఆ ఆహారం కొద్దిగా తిన్నా… కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. కారణం అల్లంలో… ఆకలిని అదుపుచేసే లక్షణాలు ఉండటమే. అలాగని ఉత్తి అల్లాన్ని తినలేం కదా… కాబట్టి… 4 రకాల ఆహార పదార్థాలతో అల్లాన్ని ఉపయోగించితే… బరువు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. అల్లం ఎలా బరువు తగ్గిస్తుంది : అల్లంలో షోగోల్స్, జింజెరాల్స్ అనే పదార్థాలుంటాయి. అల్లం తిన్నప్పుడు ఇవి మన శరీర ప్రక్రియలను నియంత్రిస్తాయి. అల్లంలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు… మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో యుద్ధం చేసి… వేడిని తగ్గిస్తాయి. ఎవరైతే అల్లం తింటున్నారో వాళ్లు ఎక్కువ కాలం ఆకలి లేకుండా ఉంటున్నట్లు పరిశోధనలో బయటపడింది. నడుం సన్నబడాలన్నా, నడుం చుట్టూ రింగులా పేరుకుపోయిన కొవ్వు కరగిపోవాలన్నా… అల్లం తినాల్సిందే. అల్లంలోని జింజెరాల్స్… మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా నియంత్రిస్తాయి.
అల్లంతో ఇలా చేస్తే సరి : బరువు తగ్గాలంటే అల్లంని ఇలా వాడాలి.
అల్లం, నిమ్మరసం : నిమ్మరసం జ్యూస్‌లో అల్లం రసం కలిపి తాగాలి. ఇవి రెండూ ఆకలిని చంపేస్తాయి. అందువల్ల మనం ఎక్కువ ఆహారం తినలేం. ఫలితంగా బరువు తగ్గుతాం.
అల్లం, నిమ్మరసం టీ : అల్లం టీలో ఓ నిమ్మచెక్క రసం పిండుకొని తాగాలి. ఇలా నాలుగైదు గంటలకు ఓసారి తాగాలి. ఫలితంగా పొట్ట నిండిన ఫీల్ కలిగి… ఆహారం ఎక్కువ తీసుకోం. రోజుకు ఇలా మూడుసార్లు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
యాపిల్ సైడెర్ వెనిగర్, అల్లం రసం : బరువు తగ్గేందుకు యాపిల్ సైడెర్ వెనిగర్ (Apple cider vinegar) బాగా పనిచేస్తుంది. ఇందులో అల్లం రసం కలిపి తీసుకోవాలి. లేదంటే అల్లం టీలో యాపిల్ సైడెర్ వెనిగర్ కలుపుకొని తాగాలి. ఐతే… అల్లం టీ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు.
గ్రీన్ టీ, అల్లం : మనకు తెలుసు… గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందని. అందులో అల్లం రసం వేసుకొని తాగితే… ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్… మన శరీరంలో కొవ్వు అంతు చూస్తుంది. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ (విత్ అల్లం జ్యూస్) తాగితే… ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
అల్లం జ్యూస్ : అల్లం రసంలో తేనె, నిమ్మరసం, నీరు కలిపి తాగితే… డీహైడ్రేషన్ సమస్య ఉండదు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్స్ మన శరీరాన్ని విష వ్యర్థాల నుంచీ కాపాడతాయి. బరువు తగ్గిస్తాయి.