అంతర్జాతీయ దిగ్గజ సెర్చ్‌ఇంజిన్ గూగుల్‌లో ఇకనుంచి న్యూస్ విభాగానికి చెందిన పిడిఎఫ్‌లు ఇక మీదట కనిపించవు.
గూగుల్ న్యూస్ విభాగం నుంచి ప్రింట్ కాపీలకు సంబంధిచిన పిడిఎఫ్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది.
ప్రింట్ కాపీలకు ప్రతులుగా ఉండే పిడిఎఫ్ కాపీలను డెస్క్‌టాప్‌ల్లో, ఆండ్రాయిడ్ ఫోన్లలో చూడడం కష్టంగా మారింది.
దీంతో చాలా మంది సంబంధిత పత్రికా వెబ్‌సైట్లను సందర్శిస్తున్నారు.
అందువల్ల గూగూల్ వాటిని తప్పించాల్సి వచ్చింది. ఇక నుంచి గూగుల్ న్యూస్ యాప్‌లో ఇవి కనిపించవని వెల్లడించింది.
ఈ మేరకు టెక్ దిగ్గజం వినియోగదారులకు ఈమెయిల్స్‌ను కూడా పంపింది.
అంతేకాకుండా ఇప్పటికే వారు చెల్లించి మొత్తానికి నిధులను రీఫండ్ చేయనుంది.
ప్రింట్ కాపీల పిడిఎఫ్ ప్రతులు ఉన్న మేగజైన్లు ఇకనుంచి గూగుల్ న్యూస్‌లో కనిపించవు అని ఆ సంస్థ స్పష్టంగా పేర్కొంది.