Business

వారంలో నాలుగు రోజులే ఆఫీస్

4 Day Work Week

ఆఫీసులో తక్కువ టైం వర్క్ చేసి.. ఎక్కువ టైమ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ తో ఎంజాయ్ చేయాలని అందరికీ ఉండే డ్రీమ్. ఇలాంటి డ్రీ జాబ్ ఫిన్లాండ్ దేశంలో నివసించే వారికి త్వరలోనే సాకారం కాబోతోంది. ఆ దేశం ప్రజలు మూడు రోజుల వీకెండ్ ఎంజాయ్ చేయబోతున్నారు. ప్రపంచంలోనే యంగ్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా రికార్డ్ సృష్టించిన ఫిన్లాండ్‌‌ కొత్త ప్రధాని సన్నా మారిన్‌‌‌‌ (34).. ఇప్పుడు మరో సంచలనానికి తెర తీస్తున్నారు. ప్రపంచమంతా ప్రస్తుతం 5 డే వర్కింగ్ వీక్‌గా ఉన్న నేపథ్యంలో ఆమె తమ దేశంలో వారంలో 4 రోజులే ఆఫీసులు ఉండేలా నిర్ణయించారు. అది కూడా రోజులో 6 గంటలే పని. ఈ నిర్ణయాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురాబోతున్నామని, ఉద్యోగులు ఎక్కువ సమయం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ తో గడిపితే.. ఆఫీసులో ఉన్నంత సేపు హుషారుగా పని చేస్తారని అంటున్నారామె.ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లోనూ అన్ని దేశాల్లో మాదిరిగానే వారంలో ఐదు రోజులు వర్కింగ్ డేస్, ఎనిమిది గంటలు పని చేసేలా సిస్టమ్ నడుస్తోంది. కొత్త ప్రధాని మారిన్ నాలుగు రోజుల వర్కింగ్ డేస్, ఆరు గంటల పని విధాన ప్రతిపాదనను ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. అయితే ఇది ఓ మహిళా నేత వర్కింగ్ స్టైల్‌గా చూడొద్దని, ఓటర్స్‌కు ఇచ్చిన మాట నిలుపుకొనే, ప్రజలకు సాయం చేసే విధానంలా చూడాలని కోరుతున్నారు మారిన్. స్వీడన్‌లో 2015 నుంచి ఆరు గంటల వర్కింగ్ అవర్స్ విధానం అమలులో ఉంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషించిన ఉద్యోగులు మంచిగా ప్రొడక్టివిటీ పెంచినట్లు ఓ సర్వేలో తేలింది. అలాగే గత నవంబర్‌లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్ వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి 39.9 శాతం అదనపు ప్రొడక్టివిటీ సాధించింది.