DailyDose

నానో కారు కనుమరుగు-వాణిజ్యం

Nano car is out of focus-telugu business news

* వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. మంగళవారం హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు మంత్రుల నేతృథ్వంలో నిర్వహించిన సమావేశంలో వాటాల అమ్మకానికి బిడ్లను ఆహ్వానించేందుకు ఆమోదం తెలిపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
*అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం వస్తుందో రాదో తెలియదు కానీ ప్రపంచం మొత్తమ్మీద ఈ ఎఫెక్ట్ మామూలుగా పనిచేయలేదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. పెట్రో ధరలు భగ్గుమన్నాయి. బంగారం ఆరున్నరేండ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. ప్రపంచంలో మిగతా కరెన్సీలతో పాటు మన రూపాయి కూడా బాగా దెబ్బతిన్నది.
* కంపెనీ లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు… ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్‌’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో కంపెనీ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయంటూ ప్రజల్లో ఉన్న ఆసక్తిని సంస్థ యాజమాన్యం కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో చౌక కారు ఉత్పత్తి దాదాపుగా అసాధ్యమేనని ఆటో పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* శాంసంగ్‌ గెలాక్సీ క్రోమ్‌బుక్‌ విడుదల
శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ క్రోమ్‌బుక్‌ పేరిట ఓ నూతన క్రోమ్‌బుక్‌ను విడుదల చేసింది. ఇందులో.. 13.3 ఇంచుల 4కె అమోలెడ్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, ఇంటెల్‌ కోర్‌ ఐ5 10వ జనరేషన్‌ ప్రాసెసర్‌, ఇంటెల్‌ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్‌, 16 జీబీ వరకు ర్యామ్‌, 1టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, వైఫై 6, బిల్టిన్‌ పెన్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 1 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ కీబోర్డ్‌ డెక్‌ కెమెరా, యూఎఫ్‌ఎస్‌/మైక్రో ఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, 49.2 వాట్‌ అవర్‌ బ్యాటరీ, క్రోమ్‌ ఓఎస్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.71,898 ప్రారంభ ధరకు ఈ క్రోమ్‌బుక్‌ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది.
* టొరెటో కంపెనీ బ్యాష్‌ పేరిట ఓ నూతన పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. బ్లూటూత్‌ 5.0తో ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో 5 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్‌ను అందిస్తున్నారు.
*దేశంలో ఆర్థిక అసమానతల రూపుమాపేందుకు సముచిత ఆదాయాలు ఉండే ఉద్యోగాల కల్పనే మార్గమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ప్రస్తుతం మన దేశం ఇలాంటి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు.
*స్టాక్ ఎక్స్చేంజ్ల్లో నమోదుకాని (అన్లిస్టెడ్) కంపెనీలనూ మరింతగా కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీలు కూడా లిస్టెడ్ కంపెనీల మాదిరిగా ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి తమ ఆర్థిక ఫలితాల నివేదికలు ప్రకటించడాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.
*ప్రపంచ బ్యాంకు ప్రకటించే సులభతర వ్యాపార సూచీలో భారత్ ర్యాంకింగ్ను పెంచడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆరు ప్రామాణికాలపై దృష్టిపెట్టింది.
*నల్లధనం కలిగిన వారి గుట్టురట్టు చేసేందుకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కుస్తీ పడుతోంది. ఇప్పటి వరకు బడా బాబుల స్విస్ బ్యాంకు ఖాతాలపైనే ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పుడు పన్నుల ఎగవేతదారులకు స్వర్గధామాలుగా పేరొందిన దేశాల్లో, వీరు నెలకొల్పిన ట్రస్టులపైనా దృష్టి పెట్టింది.
*టాటా సన్స్ చైర్మన్ పదవిని గానీ గ్రూప్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ పదవులను గానీ తాను కోరుకోవడం లేదని సైరస్ మిస్ర్తీ స్పష్టం చేశారు. అయితే హోల్డింగ్ కంపెనీ బోర్డులో స్థానంపై మాత్రం ఆసక్తి ఉందన్నారు.
*నిఫ్టీ గత వారం సైడ్వేస్, కన్సాలిడేషన్ ధోరణిలో ట్రేడయింది. నిరోధ స్థాయి 12300, మద్దతు స్థాయి 12150 మధ్యన పరిమిత పరిధిలోనే కదలాడింది. కీలక స్వల్పకాలిక నిరోధం 12300 వద్ద కరెక్షన్కు లోను కావడం వల్ల తక్షణ అప్ట్రెండ్ను కొనసాగించలేకపోయింది.
*బాబోయ్ బంగారం ధర!!బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. సోమవారం డాలర్‌ విలువ ఒకదశలో రూ.72.11కు చేరినా, చివరకు రూ.71.93 వద్ద స్థిరపడింది.సోమవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర తెలుగు రాష్ట్రాల బులియన్‌ ట్రేడింగ్‌ విపణుల్లో రూ.42వేల 200కు చేరింది.