* జననేత అంటే జనాల్ని జైల్లో పెట్టడమా: జీవీ
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమయ్యాయని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతి కోసం రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ విధించటం ఎందుకని ప్రశ్నించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
* 22వ రోజుకు చేరిన అమరావతి నిరసన
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు 22వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు టెంట్ వేసేందుకు యత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో రైతులు, వృద్ధులు, మహిళలు రహదారిపైనే భైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఎండలోనే దీక్ష కొనసాగించడంతో ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. అస్వస్థతకు గురైన రైతులకు వైద్యులు చికిత్స అందించారు. అమరావతి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా దీక్ష చేస్తామని రైతులు చెబుతున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలోనూ రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
**విశాఖ వద్దంటే బాబును ఉత్తరంద్రాలో అడుగు పెట్టనీయం- తమ్మినేని
విశాఖను రాజధానిగా చేయడం వల్ల ఉత్తరంద్రాలో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దీన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తే ఆయనను ఉత్తరంధరాలో అడుగు పెట్టనీయమని శ్రీకాకుళం జిల్లా అముదాలవలస ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ గా తానూ మాట్లాడడం లేదని, ఉత్తరాంధ్ర పౌరిడిగా ఇది తన డిమాండ్ అన్నారు. రాజధాని పై తితిదే రాద్దాంతం చేయడం తగదన్నారు. రాజధానితో సామాన్యుడికి పనిలేదని అది ఎక్కడ ఉన్నా వారికి ఒకటేనని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారే మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
*3 రాజధానులపై బీజేపీ స్పష్టంగా ఉంది: యూపీ మంత్రి
మూడు రాజధానులపై బీజేపీ స్పష్టంగా ఉందని యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. 75 జిల్లాలున్న యూపీలో ఒకే రాజధాని ఉందని, అతిపెద్ద రాష్ట్రం యూపీలో లక్నో నుంచి సమర్థంగా పాలన అందిస్తున్నామని తెలిపారు. యూపీకి ఏపీ అధికారులను పంపితే తమ పాలన తీరును వివరిస్తామని అన్నారు. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు సీఏఏకు మద్దతిచ్చాయని యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ వెల్లడించారు.
* రాజధాని రైతుల ఉద్యమంపై వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆమె.. విజయవాడలో సమ్మె చేసే సత్తాలేని వారని.. మహిళలను రోడ్డుపైకి తీసుకువచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు మహిళలను అడిగే అలా ప్రకటించారా? అని ఈ సందర్భంగా పద్మ ప్రశ్నించారు. ‘రాజధాని ఉద్యమంలో మహిళలను పావులుగా వాడుకుని లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం. మహిళలను రోడ్డెపైకి తెచ్చి అరెస్ట్ అయ్యేలా చేస్తున్నారు. గతంలో పదవులు అనుభవించి, విర్రవీగిన వారు. ఎందుకు అరెస్టు కావడంలేదు?, ఇది నీచరాజకీయం’ అని వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు.
**తలకిందులుగా తపస్సుచేసినా రాజధానిమారదు’-సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
సుపరిపాలన అందించాలని జగన్‌కు ప్రజలు అధికారం అప్పగిస్తే రాజధాని సమస్య సృష్టించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే ఏదో జరిగినట్టు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు చేయాలంటూ బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లమంది భవిష్యత్‌ను ఆ కమిటీ ఐదు రోజుల్లో తేల్చేస్తుందా? అని దుయ్యబట్టారు.
అమరావతిలో రణరంగం TNI కధనాలు
Related tags :