ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసముంటున్న వైట్‌హౌస్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో నిప్పులు చిమ్ముతున్న ఇరాన్… తాజాగా డొనాల్డ్ ట్రంప్‌ను చంపి తెస్తే 80 మిలియన్ డాలర్ల (రూ 575.44 కోట్లు) నజరానా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ నివాసమైన వైట్‌హౌస్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అమెరికా లా ఎన్ ఫోర్స్ మెంట్ వెల్లడించింది. ఇరాన్ హెచ్చరికల దృష్ట్యా వైట్‌హౌస్ చుట్టుపక్కల భద్రతా బలగాలను మోహరించారు. వైట్‌హౌస్ సమీపంలోని చెక్ పాయింట్లలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు, సాయుధ భద్రతా బలగాలు పహరాను పటిష్ఠం చేశారు. అమెరికాలో తాము మిస్సైల్ దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అమెరికాలోని ట్రంప్ నివాసమైన వైట్‌హౌస్‌లో భద్రతను పెంచారు. డొనాల్డ్ ట్రంప్ నివాసముంటున్న వైట్‌హౌస్‌లో భద్రత పెంపుపై అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
శ్వేతసౌధంలో హై-అలర్ట్
Related tags :