కళ్యాణ్ రాం హీరోగా నటించిన ‘ఎంతమంచి వాడవురా’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన మాట్లాడుతుండగా అభిమానులు అరుస్తూ ఉంటే.. బ్రదర్ సైలెంట్ గా ఉంటే మాట్లాడతా.. లేకుంటే ఇక్కడినుంచి వెళ్లిపోతా అని సున్నితంగా హెచ్చరించారు. ‘ఎంతమంచి వాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి అభిమానులు, శ్రేయోభిలాశులు నలుమూలలనుంచి వచ్చారని… వారితో పాటు తాను కూడా రావడం ఆనందంగా ఉందని అన్నారు.కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారని… అయితే ఆయన పట్ల తనకు ఒక వెలితి ఉండేదని అన్నారు ఎన్టీఆర్. కల్యాణ్ అన్న మంచి కుటుంబ సినిమా చేస్తే చూడాలని అనుకున్నానని చెప్పారు. ‘ఎంతమంచి వాడవురా’ సినిమాతో మా దర్శకుడు సతీష్ వేగేశ్న దాన్ని పూర్తి చేశారని అన్నారు. నిర్మాత కృష్ణప్రసాద్ తమ కుటుంబానికి శ్రేయోభిలాషని చెప్పారు. గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారని… వీరి కాంబినేషన్‌లో ఎంత మంచివాడవురా జనవరి 15న అందరి ముందుకు రానుందని చెప్పారు. పండగ వాతావరణంలో విడుదలవుతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం, ఎంత మంచి వాడవురా సినిమాలన్నీ పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు.
సైలెన్స్ ప్లీజ్
Related tags :