NRI-NRT

హైదరాబాద్‌లో ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయం

Afghanistan Opens Diplomatic Office In Hyderabad

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్గానిస్థాన్ దౌత్య కార్యాలయాన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లో బుధవారం ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి నహీద్ ఏసర్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. భారత్- అప్గాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు, వ్యాపారాభివృద్ధికి ఈ కార్యాలయం ఏర్పాటు తోడ్పడుతుందని నహీద్ పేర్కొన్నారు. మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ వ్యాపారం, విద్య, వైద్యం పరంగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరిగేందుకు కార్యాలయం ఏర్పాటు దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో అప్గానిస్థాన్ ప్రతినిధులు మియాహన్ సయ్యది, సిద్దిఖీ హస్సానీ, దిల్లీలోని దౌత్య కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఖాద్రీ, హైదరాబాద్లోని దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ సయ్యద్ మొహమ్మద్ ఇబ్రహింకిల్ పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి నహీద్ ఇసార్ బుధవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు.