భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కొందరు నిద్రపోతారు. ఈ కారణంగా, ఊబకాయం వంటి శారీరిక సమస్యలతో పాటుగా, ఒత్తిడి, ఆందోళనల వంటి మానసిక సమస్యలకు కూడా వస్తాయి.. ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా భోజనం తర్వాత కాసేపైనా నడవాలని సూచిస్తున్నారు నిపుణులు.మనకు సరిపడా నీటిని మనం తీసుకుంటున్నాం. రకరకాల పండ్లు కూరగాయలు తింటున్నాం. అంతేకాకుండా, నిద్రవేళకు భోజనానికి మధ్య సమయం ఉండేలా చూసుకుంటున్నాం. ఇప్పటికే ఈ చాలెంజ్‌లో భాగంగా, మీకు.. తేలికైన భావన కలిగే ఉంటుంది.. ఇటువంటి చిన్న చిన్న మార్పులు, తెలియకుండానే మీ జీవనశైలిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వస్తాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేద్దాం – భోజనం తర్వాత, ముఖ్యంగా మీ లంచ్, డిన్నర్ తర్వాత నడవడం.మీరు అనేక కారణాల వల్ల బయట నడవలేకపోతే ఇంట్లోనే నడవడం ప్రారంభించడం.. ఇక్కడ నడక ప్రధానం. ఈ నడక, మీ జీర్ణక్రియని సహాయం చేయడమే కాకుండా, అదనపు కేలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనిషిని సమూలంగా శాశ్వతంగా నాశనం చేసేది , బద్ధకం,నిర్లక్ష్యం. అవి మీలో లేవని నిర్ధారించుకోండి. మరియు, నడక తప్పించుకోవడానికి సాకులు వెతకకండి.భోజనం తర్వాత 15 నిమిషాల నడక తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. లేదా కనీసం కొద్దిసేపైనా నడిచేలా అలవాటు చేసుకోండి. అనేక అధ్యయనాల ప్రకారం, భోజనం తర్వాత నడిచే నడక, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని తేల్చాయి. మీరు షుగర్, బీపీ సమస్యల బారిన పడకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలలో ఇది కూడా ఒకటని గుర్తుంచుకోండి.కాబట్టి, తిన్నవెంటనే నిద్రకు మరియు మొబైల్ స్క్రీన్లకు అతుక్కోడానికి మంచం ఎక్కకుండా, బదులుగా నడవడం ప్రారంభించండి. సమస్యలు చుట్టుముట్టాక పరిష్కారాలు ఆలోచించడం కన్నా, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా.2009 లో ప్రచురించిన ఓ స్టడీ ప్రకారం, భోజనం తర్వాత 15 నిమిషాల నడకను అనుసరించిన, టైప్ 2 డయాబెటిస్(షుగర్) బాధితుల రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా తగ్గాయని తేలింది. రాత్రి భోజనానికి తర్వాత నడిచిన మరియు నడవని వ్యక్తుల మధ్య ఈ అద్యయనం జరిగింది.మరో అధ్యయనంలో, నిశ్చల జీవనశైలికి ఉదాహరణలుగా ఉన్న కొందరు ఊబకాయం బారిన పడడమే కాకుండా, షుగర్ వ్యాధి బారిన కూడా పడుతున్నారని తేలింది. అంతేకాకుండా, భోజనం తర్వాత 15 నిమిషాలు నడక ప్రారంభించిన తర్వాత, షుగర్ లెవల్స్ అదుపులోకి వచ్చాయని కూడా పేర్కొంది.కాబట్టి, తిన్న తర్వాత మొబైల్ ఫోన్లు చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ కాలం వెళ్ళదీయకుండా, కాసేపు నడవడానికి ప్రయత్నించండి. మరొక విషయం: కొందరు ముఖ్యమైన కాల్స్, మెసేజెస్ వస్తాయని మొబైల్‌ని అంటిపెట్టుకుని ఉంటారు. ఇటువంటి వారు, మార్కెట్లో దొరికే స్మార్ట్ బ్యాండ్లను అనుసరించడం మంచిది. ఈ స్మార్ట్ బ్యాండ్లు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లను అందిస్తూ, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండేలా చూడగలదు. వీలయితే ప్రతి రోజూ నడక సమయాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్ళండి. 15 నుండి 30 నిమిషాల వ్యవధిలోపున నడక ఉండేలా దృవీకరించుకోండి.ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సిమ్రాన్ సైని ప్రకారం, “భోజనం చేసిన వెంటనే చురుగ్గా నడవడమనేది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది, మరియు పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గిస్తుంది. వాస్తవానికి, ఈ కొవ్వు భోజనం చేసిన తర్వాత కనీస శారీరక శ్రమ లేకపోవడం వలెనే వస్తుంది. మనం తిన్న తర్వాత ఒక నడక తీసుకున్నప్పుడు, ఆహారం ద్వారా తీసుకునే పోషకాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించగలుగుతాము.” అని.
**భోజనం తర్వాత నడవడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు..
1. ఆహారం జీర్ణం అవుతుంది..
అతిగా తినడం తర్వాత మీకు బద్ధకంగా, మరియు కడుపు ఉబ్బరంగా అనిపిస్తే, కాసేపు నడవండి. మీరు తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. మీరు తినడం పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ అమలులోకి వస్తుంది. శరీర జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ నడక సహాయపడుతుంది. అలాగే అజీర్ణం మరియు గుండెల్లో మంటతో సహా కడుపు సమస్యలను కూడా తగ్గించవచ్చు.
2. మీ జీవక్రియలను వేగవంతం అవుతాయి..
మీరు సరైన ఆకారంలో ఉండేందుకు ఇష్టపడే వాళ్ళైతే, భోజనం తర్వాత నడవడమనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ జీవక్రియలను ఉత్తేజపరచడంలోనే కాకుండా, కేలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అనగా, మీ జీవక్రియలను వేగంగా జరిపించడమే కాకుండా, వేగంగా కేలరీలను కూడా కరిగించగలుగుతారు. తద్వారా మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.
3. మంచి నిద్రను సొంతం అవుతుంది..
మనస్సులో తీవ్రమైన ఒత్తిడితో అనేకమార్లు మనం నిద్రపోతూ ఉంటాం. పని లేదా వ్యక్తిగత జీవితం నుండి తలెత్తే కొన్ని ఇబ్బందులు ప్రశాంతమైన డ్రీమ్ల్యాండ్ను ఆస్వాదించనీయవు. దానికి తోడు, అజీర్ణం కారణంగా కూడా నిద్రసమస్యలు తలెత్తుతాయి. అంతేకాక, ఒత్తిడి ఆందోళనలు పెరుగుతాయి. కావున, మీ భోజనం తర్వాత నడవడం తప్పనిసరి అలవాటుగా చేసుకోండి. ఈ అలవాటు, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలోనే కాకుండా, మీ రక్త ప్రసరణను సజావుగా సాగేలా చూస్తుంది. మంచి నిద్రకు ఈ రెండూ ప్రధానమైనవి.
4. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి..
భోజనం చేసిన తర్వాత కనీసం 15 నుండి 30 నిమిషాలు నడవడం ద్వారా మీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. క్రమంగా మీరు మందుల మీద అధికంగా ఆధారపడవలసిన అవసరం ఉండదు. డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించాలనుకునేవారికి ఇది నిజంగానే అద్భుతమైన విషయమని చెప్పాలి.
5. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
మనలో ఎంతమంది, బరువు తగ్గేక్రమంలో భాగంగా రోజూవారీ వ్యాయామాలు, వర్కౌట్లను అనుసరిస్తున్నారు?., మీకు శుభవార్త ఏమిటంటే మీరు భోజనం తర్వాత నడకను అనుసరించడం ద్వారా కూడా మీ బరువును తగ్గించుకోవచ్చు. భోజనం తర్వాత చేసే నడక, కేలరీలను కరిగించడంలోనే కాకుండా, రక్త ప్రసరణకి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మరియు ఆరోగ్యకర జీవనశైలికి కూడా సహాయం చేస్తుంది.
6. రక్త ప్రసరణను మెరుగు అవుతుంది..
మీరు డిన్నర్ చేసిన తర్వాత అనుసరించే 15 నిమిషాల నడక, శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. నడక, గుండెకు సరైన ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తుంది. అనగా, మంచి రక్తప్రసరణను నిర్వహించడం ద్వారా, అనేక సమస్యలకు చెక్ పెట్టగలదు.ఒక్కమాటలో చెప్పాలంటే, నడక మీ జీవక్రియలను మెరుగుపరుస్తుంది, తద్వారా మీకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. కావున, కొద్దిగా బద్దకాన్ని పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిపరంగా అడుగులు ముందుకు వేయండి.
భుజించాక బొజ్జోకుండా కాసేపు నడువు
Related tags :