Politics

అమ్మఒడి ప్రారంభించిన సీఎం జగన్

AP CM YS Jagan Starts Ammavodi Scheme In Chittoor

చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామన్నారు. ‘పిల్లల చదువు తల్లికి భారం కాకూడదు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. 43 లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు జమచేస్తాం. దాదాపు 81 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ఏడాది నుంచి 75శాతం విద్యార్థుల హాజరు తప్పని సరి చేస్తాం. మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదోతరగతి వరకు అని చెప్పినా.. ఇంటర్‌ వరకు ఈ పథకాన్ని పొడిగించాం’’ అని జగన్‌ తెలిపారు.