Politics

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

andhra 2019 panchayat elections

అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఏపీలో అంతా ప్రశాంతమైంది. కానీ త్వరలోనే మరో ఎన్నికల వేడి రగలనుంది. ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. సర్పంచ్ ల పదవీకాలం ముగిసి దాదాపు 6 నెలలు కావడంతో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారం కిందటే దీని ప్రక్రియను ప్రారంబించారు. ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. మే 10వ తేదీలోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మే తొలివారంలో ఓటరు జాబితా సిద్ధం చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం పదో తేదీన తుదిజాబితాను విడుదల చేస్తారు. గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. ఓటర్ల తుది జాబితా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు ఈ నెల 15లోగా ఎంపీడీవోలు ఈవోపీఆర్డీవోలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి. మే 10న జాబితాను ఖరారు చేశాక రిజర్వేషన్లను వారం రోజుల సమయంలో పూర్తి చేస్తారు. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే  ప్రభుత్వం మే నెలాఖరున కానీ.. జూన్ తొలివారంలోనైనా ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.  నోటిఫికేషన్ విడుదలైన 15 నుంచి 18 రోజుల్లో నామినేషన్ దాఖలు పరిశీలన ఉపసంహరణ అనంతరం తుదిజాబితా ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తారు.