పెరుగుతున్న పని వత్తిడి,నిద్రలేమి,సరిగా తిని తినకుండా హడావిడి గా ఆఫీస్ లకు వెళ్లిపోవడం ఇవాళ్టి కాలం లో మనకు ఎదురయ్యే సాధారణ సమస్య.దీని వల్ల మనం ఆరోగ్యాన్ని ఎంత నిర్లక్షo చేస్తున్నామో కూడా అర్థం చేసుకునే టైం కూడా ఉండదు కొందరికి.ఈ పైవాటివాల్లా మనకు ఎదురయ్యే మొట్ట మొదటి సమస్య ‘గ్యాస్ ట్రౌబుల్’. అసలు గ్యాస్ ట్రౌబుల్ అంటే ఏమిటి? లక్షణాలు,రోజుకి 10 నుండి21 సార్లు గ్యాస్ ని పాస్ చేయడం అనేది సాధారణం, అంతకంటే ఎక్కువ సార్లు గ్యాస్ ఎక్కువ సార్లు వస్తుంటే అది సమస్యగా మారిందని అర్ధం.
*కాస్త తినగానే కడుపు బాగా ఉబ్బినట్టు,నిండిపోయినట్టు అనిపించడం.
*తేన్పులు మాటి మాటికి రావడం.
*ఆకలిగా లేకపోవడం.
*కడుపు మందకొడిగా ఉండడం.
*కడుపు నొప్పిగా ఉండడం.
*తిన్న కొంచం కూడా చాలా సేపు డైజెస్ట్ కాకపోవడం.
*ఛాతి లో నొప్పి,మంట,ఇవన్నీ మనం గస్ ట్రౌబుల్ లక్షణాలుగా గుర్తించవచ్చు
కారణాలు:
ఫైబర్ తక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం,జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోవడం,వేళకు సరిగా భోజనం చేయకపోవడం,శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వకపోవడం,జీర్ణక్రియ మందకొడిగా జరగడం అన్నవి అన్ని కడుపులో గ్యాస్ పెరగడానికి కారణాలు కావొచ్చు.ఇంటి చిట్కాలు:గ్యాస్ ని నిర్మూలించడానికి అనేకరకమైన చిట్కాలు ఉన్నాయి,అందులో చాలా మందికి తెలియనిది ఒకటిఅదేంటో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా “నల్ల ఉప్పు” గురించి విన్నారా.దీనినే “హిమాలయ పింక్ సాల్ట్”అని కూడా పిలుస్తారు.దీనిని చాలరాకల వంటలలో కూడా ఉపయోగిస్తారు.ఒకవేళ మీరు గ్యాస్ సమస్య తో బాధపడుతున్నట్టైతే “పలుచటి మజ్జిగని చేసుకుని దానిలో నల్ల ఉప్పు ని కలుపుకొని రోజుకు మూడు పూటలు తాగుతూ ఉండండి.ఇలా రోజు తాగడం వల్ల మీ పొట్టలో ఉన్న ఎక్సెస్ గ్యాస్ బైటకు వెళ్ళిపోయి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది. నల్లఉప్పు లో సోడియం తక్కువగా ఉండడం వల్ల BP ఉన్న వారు కూడా దానిని తీసుకోవొచ్చు.దీనిలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఒకరకమైన వాసన ను కలిగి ఉంటుంది.జమ్మూ&కాశ్మీర్ లో దీనిని గాయిటర్ సమస్యను ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు.