DailyDose

అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్-రాజకీయ

TRS Delivers B-Forms To Municipal Election Candidates

*మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. నిర్మల్ మున్సిపాలిటీ అభ్యర్థుల‌ బి – ఫారాలను సీఎం కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అంద‌జేశారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై సేకరించిన సమాచారం ఆధారంగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలిపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు
*చంద్రబాబుకు హారతులతో ఘనస్వాగతం
మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబు దారి పొడవునా మహిళలు, తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విజయవాడలోని ఆటోనగర్‌, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరులో మహిళలు కాన్వాయ్‌ ఆపి హారతులిచ్చారు. గంగూరు, పునాదిపాడు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఆయనపై పూలవర్షం కురిపించారు. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
* రాజధాని పోరులో నేనూ పాల్గొంటా:నారా రోహిత్‌
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని సినీనటుడు నారా రోహిత్‌ అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ జీవచ్ఛవంలా మారిందని.. అలాంటి రాష్ట్రానికి ప్రాణ సమానమైన భూములను త్యాగం చేసిన రైతులు అమరావతి రూపంలో ప్రాణం పోశారని కొనియాడారు. వారి ఔదార్యంతోనే అమరావతిలో పాలనకు బాటలు పడ్డాయన్నారు. రైతుల త్యాగం వృథాగా పోకుండా 23 రోజులుగా వారు చేస్తున్న న్యాయమైన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘‘రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కవోని దీక్షతో రైతులు ముందడుగు వేస్తున్నారు. వారి పోరాటం వృథా కాదు. త్వరలోనే రైతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటాను’’ అని నారా రోహిత్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
* రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గాలి: వెంకయ్య
పంచాయతీ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలు ఏకకాలంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫోరం ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఆధ్వర్యంలో ‘మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం ఉండాలన్నారు. అభ్యర్థి కులం, మతం చూసి కాకుండా గుణం, సత్తా, నేర ప్రవృత్తి తెలుసుకొని ఓటెయ్యాలని ఓటర్లకు సూచించారు. పార్టీ కార్యక్రమాలు, జనసమీకరణకు చేస్తోన్న ఖర్చులపై రాజకీయ పార్టీలు నియంత్రణ పాటించాలని సూచించారు. మీడియా సైతం పెయిడ్‌, తప్పుడు వార్తల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఇందుకు రాజకీయనాయకులతోపాటు ప్రజలు సైతం బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
* కావాలంటే కడపలో పెట్టుకో: జేసీ
రాజధానిని ముక్కలు చేసుకుంటూ పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కావాలంటే కడపలో పెట్టుకో.. లేకపోతే పులివెందులలో పెట్టుకోమని ఆయన సూచించారు. విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు. రాజధానిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. రాజధాని అమరావతిలో ఉండాల్సిందే.. మరో మార్గం లేదన్నారు. తాత్కాలికం తాత్కాలికం అంటూ..చంద్రబాబు పిచ్చి పని చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని జేసీ వ్యాఖ్యానించారు. రాజధానిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న భవనాలను తాత్కాలికమని చంద్రబాబు చెప్పారన్నారు. రాయలసీమకు హైకోర్టు వస్తే ఏం లాభం..?..పది జిరాక్స్‌ షాపులు వస్తాయన్నారు.
* అనంతపురంలో ధర్నా చేపట్టిన టీడీపీ నేతలు
టీడీపీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. అనంతపురం టవర్ క్లాక్ ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. రైతులు 22 రోజులపాటు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తుంటే.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు.. వారికి సంఘీభావం తెలపడానికి వస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కో్సం పనిచేయాలని సూచించారు. ఉద్యమాలను ఎవరూ ఆపలేరని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
*టీడీపీ గూండాల పనే – ఎమ్మెల్యే కాటసాని
రాజధాని కోసం అమరావతిలో ఆందోళన చేస్తున్నది టీడీపీ గూండాలే తప్ప ఇంకొకరు కాదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు 80వేల ఎకరాలు ఇవ్వడంతో పాటు రాజధాని కోల్పోయిన కర్నూలు ప్రజలు ఏనాడు మాట్లాడలేదని, ఇప్పుడు మూడు రాజధానుల కారణంగా కర్నూలు అభివృద్ధి చెందబోతుందంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా జగన్ ఆలోచనను మెచ్చుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కాటసాని కోరారు.
* బస్సు యాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం- కేఈ
ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకొని, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చూసి సీఎం జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏడు నెలల వైకాపా పాలనలో మత, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం ఇలా వ్యవహరించి ఉంటే జగన్‌ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశవైఖరి, అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని కేఈ పిలుపునిచ్చారు.
* చంద్రబాబు తో పాటు పలువురు నేతల
అరెస్ట్ ను జనసేన తరపున ఖండిస్తున్నాంగతంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారురైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరపున పోరాడుతాంజాయింట్ యాక్షన్ కమిటీతో పాటు తమ పార్టీ నేతలు కూడా పాల్గొంటారురాబోయే వారం రోజుల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో కలిసి చర్చించాంఈరోజు సాయంత్రం విజయవాడకు పవన్ కళ్యాణ్ వస్తున్నారురైతులకు భరోసా కల్పించాలిరైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోండిప్రజాప్రతినిధులు రాజధాని గ్రామ ప్రాంతాల్లో పర్యటించాలివారి వేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలిఅమ్మ ఒడి పై రోజుకో ప్రకటన చేస్తున్నారుఅమ్మ ఒడి కి ఇతర పథకాల నిధులను మల్లించారు
* అమ్మ ఒడి చారిత్రాత్మక కార్యక్రమం-మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
అమ్మఒడి పథకం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక అని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో గురువారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన 7 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. నాడు నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలలను అన్ని వసతులతో ఏడాది కాలంలో ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, నమోదు చేసుకున్న వారందరికీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదువుతో ఉన్నత స్థానాలకు చేరుకుని మంచి జీవితాన్ని జీవించవచ్చని అన్నారు. ఉగాది నాటికి అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, అమ్మఒడి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అమరావతి తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మంత్రి విమర్శించారు. అమ్మఒడి పథకం అనేది జగనన్న నవరత్నాల్లో మొదటి రత్నమని మున్సిపల్‌ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు.
* బి- ఫారాల‌ను అంద‌జేసిన సీఎం కేసీఆర్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. నిర్మల్ మున్సిపాలిటీ అభ్యర్థుల‌ బి – ఫారాలను సీఎం కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అంద‌జేశారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై సేకరించిన సమాచారం ఆధారంగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలిపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.
* రాష్ట్రమంతా తెరాసకే సానుకూలం: కేసీఆర్‌
రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుంటామన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అన్ని చోట్లా ఆశావహుల నుంచి తీవ్రపోటీ ఉందన్నారు. టికెట్లు దక్కనివారు నిరాశ పడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. టికెట్లు రానివారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు
* విపక్షాలకు హ్యాండిచ్చిన మమత బెనర్జీ..!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తలపెట్టిన విపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్ణయించుకున్నారు. అందుకు గల కారణాన్ని ఆమె తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. అందుకే తాను విపక్ష సమావేశానికి హాజరుకావడం లేదని మమత స్పష్టం చేశారు. ఈ పరిణామంతో సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఒంటరిగానే పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించే నిమిత్తం జనవరి 13న ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల సమావేశం జరగనుంది.జేఎన్‌యూలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, డీఎంకే చీఫ్ స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలు హాజరుకానున్నారు. మమత బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె తీసుకున్న తాజా నిర్ణయంతో విపక్షాలు డైలమాలో పడ్డాయి.
* మాజీ కేంద్రమంత్రి, టిడిపి సభ్యులు అశోక్ గజపతి రాజు కామెంట్స్
రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.పోలవరం ఆపడం,ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆపడం దుర్మార్గం.గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో గాని జగన్ పాదయాత్రలో గాని అరెస్టు లు జరిగాయా?!ఏరాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతలు అరెస్ట్ సంస్కృతి లేదు
జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసింది.రాజధాని భూములు తిరిగిచేస్తారన్న అంశం ఆశ్చర్యనికి గురిచేస్తుంది ఇది సాధ్యమా?!
అభివృద్ధిని అడ్డుకుని రివర్స్ గెర్లో నడుస్తున్న ప్రభుత్వంఇది.పోలవరం ఆపేసి విశాఖ కు నీరు తెస్తాననడం సాధ్యమా?ఆంధ్రప్రజలకు అన్యాయం చేస్తున్నారుఅభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేసుకుని వెళ్ళాలిఅందరిని రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచివికాదుఒకరు స్మశానమని, మరోకారు ఎడారి అని, ఇంకొకరు ముంపు ప్రాంతమని అనడం ఎంతవరకు సబబుప్రజలంతా బయటకు రావాలి..ఇది ఒక రాజకీయ పార్టీకి సంబందించిన సమస్య కాదు రాష్ట్రానికి, దేశానికి సంబందించిన సమస్యచంద్రబాబు ఆర్ధిక కుంభకోణాలతో జైలుకి వెళ్లిన వ్యక్తి కాదుచంద్రబాబు సమర్ధమైన, అనుభవం ఉన్న నాయకుడుశ్రీనగర్ లో ఉన్న పరిస్థితిని ఆంధ్ర ప్రదేశ్ లో తీసుకురావడం అన్యాయం.
*జేఏసీ యాత్రను అడ్డుకోవడం సరికాదు: నాదెండ్ల
జేఏసీ యాత్రను అడ్డుకోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాజధాని గ్రామాల వారితో ప్రభుత్వం చర్చించాలని కోరారు. ప్రజల బాధను వినే అవకాశం ఇవ్వని జగన్.. సీఎంగా అనర్హుడు అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు.
*అమరావతిలో ఆందోళన చేస్తోంది టీడీపీ గూండాలే: కాటసాని
రాజధాని కోసం అమరావతిలో ఆందోళన చేస్తున్నది టీడీపీ గూండాలే తప్ప ఇంకొకరు కాదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు 80వేల ఎకరాలు ఇవ్వడంతో పాటు రాజధాని కోల్పోయిన కర్నూలు ప్రజలు ఏనాడు మాట్లాడలేదని, ఇప్పుడు మూడు రాజధానుల కారణంగా కర్నూలు అభివృద్ధి చెందబోతుందంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా జగన్ ఆలోచనను మెచ్చుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కాటసాని కోరారు.
* బస్సు యాత్రకు జగన్‌ భయపడుతున్నారు: కేఈ
ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకొని, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చూసి సీఎం జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏడు నెలల వైకాపా పాలనలో మత, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం ఇలా వ్యవహరించి ఉంటే జగన్‌ పాదయాత్ర చేసేవారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశవైఖరి, అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని కేఈ పిలుపునిచ్చా
* అమరావతికి మద్దతుగా ‘మన్‌కీ బాత్‌’కు ఫోన్లు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని రైతులు, యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు ఇవాళ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తమ నిరసనలు ప్రధాని నరేంద్ర మోదీకి వినిపించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన్‌కీ బాత్‌ ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి తమ ఆవేదనను తెలియజేశారు. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను ఆదుకోవాలని కోరారు.
అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రధానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రైతులు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా తమ ఆవేదన తెలుసుకున్న ప్రధాని మోదీ తప్పకుండా సమస్యపై చర్చిస్తారని, రాజధాని అంశంపై కేంద్ర నిర్ణయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.
* పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో అమ్మ ఒడి పథకం ఆవిష్కరణ సభలో సీఎం జగన్ కామెంట్స్
చిన్నారులకు, వాళ్ళ తల్లులకు అమ్మ ఒడి అంకితంపాదయాత్ర సమయంలో పిల్లల చదువుల కోసం తల్లుల తాపత్రయం చూశానుపేదింటి పిల్లలకు…తల్లులకు అభ్యున్నతి కోసమే ఈ పథకం43 లక్షల మంది తల్లులు… 82లక్షల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ది అర్హులైన ప్రతి తల్లికి నేరుగా 15వేలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాంబ్యాంక్ లో పాత అప్పు ఉన్నా ఈ డబ్బు మినహించుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడాం 6318కోట్ల రూపాయలు ఈ రోజు అర్హులైన తల్లులు బ్యాంక్ అక్కౌంట్ల లో పడనున్నాయిఈ ఏడాది సమయం ఇద్దామని 75 శాతం అటెండేన్స్ షరతు మినహాయించాము వచ్చే ఏడాది నుంచి 75శాతం హాజరు తప్పని సరిప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం దిశగా అడుగేస్తున్నాం ఆంగ్ల మాధ్యమం పై ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకు, సినిమా యాక్టర్ కి వినిపించడం లేదుఒక్కో తరగతి లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ…నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం
* అచ్చుతప్పుతో మంత్రిత్వ శాఖే మారింది..
మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల తర్వాత కాంగ్రెస్‌ మంత్రి విజయ్‌ వాడెత్తివార్‌ కొంత అసంతృప్తికి గురయ్యారు. అయితే దీనికి కారణం ‘అచ్చుతప్పు’ అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్పీపీ నేత అజిత్‌ పవార్ తాజాగా వెల్లడించారు. ప్రిటింగ్‌లో జరిగిన పొరబాటు కారణంగా విజయ్‌కి ఓ శాఖకు బదులుగా మరో మంత్రిత్వశాఖ వచ్చిందన్నారు.
* రాజధానికోసం పోరాటం కొనసాగిస్తాం: చంద్రబాబు
శాంతిభద్రతల పేరుతో అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని తెదేపా అధినేతచంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చంద్రబాబుతో పాటు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. ఐకాస నేతల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. సెక్యూరిటీ కోసం బస్సులు ఆపామని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. నేను కూడా అడ్డుకుని ఉంటే వాళ్లు పాదయాత్రలు చేసేవారా అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజారాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
* బడ్జెట్‌ సమావేశాలు.. రెండు విడతల్లో
ఈ ఏడాది పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ ప్రతిపాదనల మేరకు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 మధ్య రెండు విడతలుగా సమావేశాలు జరపనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత.. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రెండు విడతల మధ్య దాదాపు మూడు వారాల విరామం ఉంది. ఈ సమయంలో వివిధ మంత్రిత్వశాఖలకు కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలపై కేంద్ర కేబినెట్‌ చేసిన సిఫార్సుల గురించి రాష్ట్రపతి ఇప్పటికే ఉభయసభలకు సమాచారమిచ్చారు.
* రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి రైతులు పాదయాత్రగా బయల్దేరారు. నందివెలుగు సమీపంలోకి పాదయాత్ర చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన పోలీసులు పాదయాత్ర నందివెలుగు దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరోసారి అడ్డుకుని ఆలపాటిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు జీపులో దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా రైతులు, తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతుల పాదయాత్రతో గుంటూరు-తెనాలి మార్గంలో రాకపోకలకు అంతరాయమేర్పడింది.
* సిఎం నిర్ణయాన్ని సమర్దిస్తునన్నాను – మంత్రి మల్లాడి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. తాళ్ళరేవు మండలం పరిధిలోని జార్జి పేట పంచాయతీ ఎం ఎల్ కె నగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాల అభివృద్ధే ద్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటు లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఒడి పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిని అభినందించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఓటు కి నోటు అనే సంస్కృతిని పూర్తిగా రూపుమాపాలని తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా నిజాయితీగా, నిస్వార్ధంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని కోరారు. అతి తక్కువ కాలంలోనే ప్రజలకిచ్చిన ప్రధాన హామీల్లో నవరత్నాలు పథకాన్ని 80 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముందుగా వైకాపా రాష్ట్ర నాయకులు కుడుపూడి శివన్నారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ 1.60 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన కళా వేదిక ను ఎమ్మెల్యే పొన్నాడ ప్రారంభించారు.
*సబ్బండ వర్గాలను సంతృప్తి పరిచేలా..
పురపాలక సంఘాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఉమ్మడి మేనిఫెస్టోకు తుదిరూపు ఇస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి నేతృత్వంలో పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ.. ముసాయిదాపై కసరత్తు చేస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహా వివిధ వర్గాలకు సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేరుస్తున్నారు. ముసాయిదా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి పీసీసీకి అందజేసి సూచనలు సలహాలతో తుది మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నారు.
* బస్సు యాత్రకు ఎందుకు అడ్డుపడుతున్నారు?-చంద్రబాబు మండిపాటు
విజయవాడ నుంచి మచిలీపట్నం, కాకినాడ, కర్నూలు, ఒంగోలుకు బస్సుయాత్రగా వెళ్లకూడదని ఎక్కడుంది? ఏమిటీ దౌర్జన్యం అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్నా యాత్రకు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బస్సు యాత్రకు ఐకాస నేతలు అనుమతి తీసుకున్నారు. అయినా అమరావతి, తుళ్లూరు నుంచి వచ్చే 30 మంది మహిళల్ని మధ్యలో ఆపి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఏమిటీ దౌర్జన్యం? పిచ్చిపిచ్చిగా చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు పోలీస్స్టేషన్లూ చాలవు. తిరుపతిరావు, శివారెడ్డి, స్వామి.. వీరంతా రాష్ట్రప్రజల కోసం ముందుకొస్తే వారిపైనా ప్రతాపం చూపిస్తారా? ఇది మంచి పద్ధతి కాదు’’ అని హెచ్చరించారు.
*పుర ఎన్నికల్లో తెరాసకు ఎదురులేదు-పార్టీ శ్రేణులకు సీఎంపై అచంచల విశ్వాసం
పురపాలక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితికి ఎదురు లేదని, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల మాదిరే సంపూర్ణ విజయం సాధిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కాంగ్రెస్, భాజపా పార్టీలకు దిక్కూదివానం లేదని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డ్డిలతో కలిసి తెలంగాణభవన్లో విలేకరులతో మాట్లాడారు.‘పురపాలక ఎన్నికలకు తెరాస పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రజలు స్పష్టంగా మావైపే ఉన్నారు. పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. పుర ఎన్నికల తర్వాత పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశగా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు.
*బలంగా ఉన్న వార్డుల్లో ఒంటరిగానే పోటీ-తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ
బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ముఖ్యనేతలతో బుధవారం ఎన్టీఆర్భవన్లో ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బలంగా ఉన్న అన్ని వార్డుల్లో తెదేపా ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఇతర పార్టీలతో ఎక్కడైనా చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే స్థానిక నేతలే నిర్ణయించుకుంటారని చెప్పారు. మున్సిపాలిటీలకు ఇన్ఛార్జులను నియమిస్తామన్నారు. ఇప్పటికే కమిటీలు వేశామని, పార్లమెంటు నియోజకవర్గ కమిటీలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని నామినేషన్ల తర్వాత రాష్ట్రనేతలు ప్రచారం ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెదేపా హయాంలోనే తెలంగాణలో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయదు
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గ్లాసు గుర్తుతో జనసేన పోటీ చేయడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్రులుగా బరిలో దిగవచ్చన్నారు. అందుకు పార్టీ అధ్యక్షుడు అనుమతి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
*రైతులను మోసం చేయడమే-దేవినేని ఉమా
ముందుగానే విశాఖపట్నంలో భూములు కొనుగోలు చేసి రాజధాని మారుస్తున్నట్లు ప్రకటన చేయడం అమరావతికి 33వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను మోసం చేయడమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కంచికచర్లలో ఆయన మాట్లాడారు.
*అణచివేస్తే ఉద్యమం ఉద్ధృతమవుతుంది-జనసేన అధినేత పవన్కల్యాణ్
రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శించారు. ఇందులోభాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని, ఇలాంటి చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్కల్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఈ ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలి’ అని పవన్ పేర్కొన్నారు.
*స్థానిక ఎన్నికలకు రాజధానికి సంబంధం లేదు-మంత్రి అవంతి శ్రీనివాస్
మూడు రాజధానుల ఏర్పాటు అంశానికి స్థానిక ఎన్నికలకు ముడిపెట్టకూడదని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయంలో ఈ అంశాన్ని రిఫరెండంగా తీసుకోవచ్చా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అవంతి పైవిధంగా బదులిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని చెప్పారు.
*పిన్నెల్లిపై దాడి సూత్రధారి పులివెందుల నేతే : వర్ల
పులివెందులకు చెందిన వైకాపా యువ విభాగం నేత షరీఫ్ అనే వ్యక్తి చినకాకాని ఎందుకు వచ్చాడో, రైతుల మధ్యకు వచ్చి పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు అడ్డుకున్నాడో చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యేపై దాడికి ఆయనే సూత్రధారని ఆరోపించారు.