ఇంగువ… ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం. పొడిగా… ముద్దగా… రెండు రకాల్లో లభ్యమవుతుంది. పులిహోర, రసం, సాంబారు, పచ్చళ్లు… అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. దీని మరిన్ని ప్రయోజనాలు…
* ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాసు, కడుపు ఉబ్బరం… లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
* ఈ పొడిలోని యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి.
* సెనగగింజ పరిమాణంలో బెల్లం మధ్యలో పెట్టి తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది.
* కప్పు నీళ్లను బాగా మరిగించి, చిటికెడు ఇంగువ వేసి రోజులో రెండు మూడు సార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది.
* సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తీసుకుంటే నులిపురుగుల సమస్య ఉండదు.
* అన్నంలో మొదటి ముద్దను.. నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలుండవు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు అవుతాయి.