Kids

బుడ్డోడా…ఈ బుడగ పగలదురా!

How to make a balloon that wont break even when you poke it

సాధారణంగా బెలూన్‌ని సూది మొన లాంటి దానితో గుచ్చితే ఏమవుతుంది?

అరే అది కూడా తెలీదా? పగిలిపోతుంది అంటారా!

కానీ మీ స్నేహితులకి బుడగ పగిలిపోకుండా గుచ్చి చూపించండి వాళ్లని ఆశ్చర్యపరచండి.

ఎలాగో తెలియాలంటే చదివేయండి మరి..!

ఒక బుడగ తీసుకోండి. దానిని ముడి వేసిన స్థానంలో పదునైన పుల్లతో ఇలా గుచ్చండి. ఆ బుడగ పగలదు. అలాగే ఆ కొన నుండి ఇంకో కొనకి గుచ్చండి అయినా మీ బుడగ పగలదు. ఇంకేముంది ఇలా మీ స్నేహితుల ముందు చేసి వారందరిని ఆశ్చర్యపరచండి.