* వేడుకల సమన్వయకర్తగా పొట్లూరి రవి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 23వ ద్వైవార్షిక మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేయేనియా కన్వెన్షన్ సెంటరులో 2021 జులై 2,3,4 తేదీల్లో నిర్వహించాలని శుక్రవారం రాత్రి జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. ఈ సభల సమన్వయకర్తగా తానా కార్యదర్శి పొట్లూరి రవి వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. 2001లో ఇదే కన్వెన్షన్ సెంటరులో తానా 13వ ద్వైవార్షిక మహాసభలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సభల విజయవంతానికి, తానా స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఫిలడెల్ఫియా తానా బృందం సమిష్ఠిగా కృషి చేస్తుందని రవి పేర్కొన్నారు.