NRI-NRT

డెట్రాయిట్‌లో “జై అమరావతి”

Detroit NRIs Support Amaravathi Farmers Protest

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అమెరికాలోని డెట్రాయిట్ ప్రవాసులు ఆదివారం నాడు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని సెయింట్ తోమా చర్చిలో “సేవ్ అమరావతి-సేవ్ ఏపీ” పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెట్రాయిట్ స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని జగన్ ప్రభుత్వానికి తమ వినతులు వెల్లడించారు. మూడు రాజధానుల మధ్య అధికారులు, నేతలు, ప్రజలు తమ విలువైన సమయాన్ని, ఆర్థిక వనరులను నష్టపోతారని అందుకే ప్రభుత్వం మరోసారి రాజధాని అంశాన్ని సున్నితంగా పరిశీలించాలని కోరారు.