వైకాపా ప్రభుత్వం ఏపీలోని మూడు ప్రాంతాల అభివృద్ధి పేరిట అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం మానుకోవల్సిందిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ప్రవాసులు జగన్ సర్కార్ను కోరారు. రైతులు ప్రభుత్వాలను నమ్మి పంటపొలాలను ధారదత్తం చేశారని కానీ నేడు వారిని అడ్డంగా మోసగించేందుకు జరుగుతున్న రాజధాని విస్తరణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మహిళలపైన కనీస మర్యాద మానవత్వం లేకుండా లాఠీలతో తూట్లు పొడుస్తున్నారని వారు ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తగిన దృష్టి సారించి ఏపీని, అమరావతిని కాపాడాలని వారు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వేమన సతీష్, ఉప్పుటూరి రాంచౌదరి, ఉప్పలపాటి అనీల్, బొద్దులూరి యాష్, లాం కృష్ణ, పాలడుగు సాయిసుధ, సూరపనేని సత్య, గుడిసేవ విజయ్ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు.
అమరావతి రైతులకు డీసీ ప్రవాసుల భరోసా
Related tags :