జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులతో ఆయన సమావేశం అవుతారని వార్తలొచ్చాయి.
అయితే పవన్ ఆదివారం తాను బస చేసిన హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం.
అమిత్ షా మధ్యప్రదేశ్ పర్యటనతో పాటు దిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు.
మరోవైపు భాజపా అగ్రనేతలు దిల్లీ అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సమావేశంలో బిజీగా ఉన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రాంమాధవ్ నేడు దిల్లీకి చేరుకోనున్నారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలపై మరో ప్రధాన కార్యదర్శి సంతోష్ తీరికలేకుండా ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ నేతలను కలిసేందుకు పవన్ ప్రయత్నించినట్లు తెలిసింది.