కేరళలోని శబరిమలలో బుధవారం సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని దర్శించుకున్న లక్షలాది భక్తులు తన్మయంతో పునీతులయ్యారు. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తుల స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మకరజ్యోతి కనిపించింది
Related tags :