Food

సంక్రాంతి వంటకాలు ఆరోగ్యానికి మంచివి

Telugu Food And Diet News-Sankranthi Foods Are Healthy

సంక్రాంతి ఫేమస్ వంటలు ఇవే.. వీటిని తింటే ఎన్ని లాభాలంటే..

పండుగలు అంటేనే.. చాలు బోలెడు పిండి వంటలు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా, సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండుగల్లో చేసే వంటకాలు అంటే నోరూ ఊరిపోతుంది. కేవలం వీటిని రుచి కోసం మాత్రమే చేసుకుని తింటామంటే పొరపాటే.. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సంక్రాంతి పండుగ వంటలు..

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండి వంటల ఘుమఘుమలే ఉంటాయి. ఈ సమయంలోనే సిటీల్లో ఉండేవారంతా పట్నం బాట పడతారు. ఇళ్ళన్ని కళకళలాడతాయి. దీంతో ప్రతీ ఒక్క ఇంట్లోనూ పిండివంటలు చేసుకుంటారు. ఇందులో ఎక్కువగా ఏమేం చేస్తారో ఇప్పుడు చూద్దాం.. సకినాలు, జంతికలు, నువ్వుల ఉండలు, సున్ని ఉండలు.. ప్రాంతాలను బట్టి చాలా మంది ఇతర వంటలను కూడా చేస్తుంటారు. కానీ, వీటినే ఎక్కువమంది చేసుకుంటారు. అయితే, ఈ వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సకినాలు..

బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి వీటిని చేస్తారు. అందులో నువ్వులు, వాము వేసి చేస్తారు. వీటిని చాలా చోట్ల ఓ 10, 20 రోజుల ముందు నుంచే చేస్తారు. దాదాపు నెలకు పైగానే నిల్వ ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కొన్ని చోట్ల అయితే, వీటిని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లా కూడా తీసుకుంటారు. ఇందులో నువ్వులు, వాము ఉంటుంది. నువ్వుల్లో ఎన్నోపోషకాలు ఉంటాయి. చలికాలంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి.. ఈ కాలానికి సరిపోయేలా ఉంటుంది ఈ వంట. నువ్వులను చలికాలంలో తీసుకుంటే ఒంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అదే విధంగా ఇందులో ఉపయోగించే వాము కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి.. హ్యాపీగా ఈ సమయంలో వీటిని తినేయొచ్చు.

జంతికలు..

కేవలం సంక్రాంతికి మాత్రమే కాదు.. ప్రతి ఒక్క పండుగకి వీటిని చేస్తుంటారు. చెప్పాలంటే ఇవి మంచి స్నాక్ ఐటెమ్ అని చెప్పొచ్చు. ప్రాంతాలను బట్టి ఇవి వేర్వేరుగా ఉంటుంది. కొంతమంది ఇది బియ్యం, శనగపిండి, ఉప్పు, కారం మాత్రమే వేసి చేస్తుంటారు. మరికొంతమంది వీటికి అదనంగా, వాము, నువ్వులు చేర్చుతారు. ఇందులో వాడే శనగపిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మేలు చేస్తుంది. అయితే, కొద్ది పరిమాణంలో వీటిని తీసుకోవాలి.

నువ్వుల ఉండలు..

నువ్వులు ఉండలు.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా ఇవి చలికాలంలో తీసుకోవడం చాలా మంచిది. అదే విధంగా, బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఈ స్నాక్ ఐటెమ్ ఎంతో బాగుంటుంది.

సున్నుండలు..

మినుములతో చేసే సున్నుండలు ఎంతో బలాన్ని ఇస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల తక్షణసాయం వస్తుంది. ఇందులో ఉపయోగించే మినపప్పు వల్ల తీసుకోవడం శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కాబట్టి వీటిని తీసుకోవాలని చెబుతారు.

మోడ్రన్ లైఫ్‌కి అలవాటు పడిన వారు మన వంటలు, వాటిలోని పోషకాలను తెలుసుకోవడం లేదు. అందుకే చాలా మంది స్వీట్స్, కేక్స్ అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎక్కువగా ఊబకాయం, ఇతర సమస్యల బారిన పడుతునున్నారు