ఏపీ రాష్ట్రంలో జనసేనతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బీజేపీ ఏపీరాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ భేషరతుగా బీజేపీతో కలిసి పనిచేసేందుకు వచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. గురువారం నాడు విజయవాడలోని ఓ హోటల్‌లో కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించినట్టుగా చెప్పారు. వచ్చే నాలుగున్నర ఏళ్ల పాటు కూడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఏం చేయాలనే దానిపై వ్యూహాలను అనుసరిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై కూడ పోరాటం చేస్తామన్నారు. తమ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రక ఘట్టంగా ఆయన చెప్పారు.ఏపీ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రెండు పార్టీల నేతలు కలిసి పోటీ చేయనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
పవన్ మాతో బేషరతుగా కలిసొస్తున్నారు
Related tags :