ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగ దంపతులు తమ మూడున్నరేళ్ల పాపను హైటెక్స్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. రోజూ మాదిరిగా ఈ నెల 10న కూడా చిన్నారి పాఠశాలకు వెళ్లింది. పాఠశాల ముగిసే సమయానికి తల్లి వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చారు. రోజూ పాఠశాలలో ముచ్చట్లు చెప్పే ఆ చిన్నారి.. ఆ రోజు ఇద్దరు ఆయాలు తన జననాంగంలో రాయి ఉంచారని తెలిపింది. ఆయాలతో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి తల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మాటిమాటికి మూత్రం పోస్తోందని ఆయాలు ఇంతటి దారుణానికి ఒడికట్టినట్టు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
మూడేళ్ల పసిపాప జననాంగంలోకి రాళ్లు పెట్టిన ఆయాలు
Related tags :