‘వినయవిధేయరామ’ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వాణీ జోడి మరోసారి వెండితెరపై కనువిందు చేయనుందా? అంటే ఔననే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. సామాజిక ఇతివృత్తానికి యాక్షన్ హంగులను మిళితం చేస్తూ రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ సరసన కియారా అద్వాణీ నటించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియన్ కథతో రూపొందుతున్న సినిమా కావడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్య పాత్ర కోసం కియారా అద్వాణీని తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించినట్లు చెబుతున్నారు. రామ్‌చరణ్, కియారా అద్వాణీలపై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌లో వీరిద్దరు షూటింగ్లో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొణిదెల సరసన కియారా
Related tags :