సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా అంబటి కౌంటర్ ఇచ్చారు. ‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా…. లేక’ అంటూ నాగబాబుపై వ్యంగ్య ధోరణిలో మండిపడ్డారు. నాగబాబు ట్వీటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైవిధంగా స్పందించారు. ‘బహు పాత్రలలో బాగు బాగు’ అని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
తోకలేని పిట్ట కథలు
Related tags :